News December 9, 2025
కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర పూజలు

విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు జరుగుతుండగా.. మంగళవారం లక్ష్మీహోమం, పూర్ణాహుతి నిర్వహించారు. డిసెంబర్ 19 వరకు ఆర్జిత సేవలు రద్దు చేశారు. రూ.500 దర్శనం, ప్రసాదం కోసం వాట్సాప్ (9552300009) ద్వారా బుక్ చేసుకోవచ్చు. వృద్ధులు, గర్భిణులకు గురువారం తప్ప మిగతా రోజుల్లో మధ్యాహ్నం 2-3 గంటల వరకు దర్శనం కల్పిస్తున్నారు. వచ్చే గురువారం (డిసెంబర్ 11) రద్దీ దృష్ట్యా పూజా వేళలు కుదించారు.
Similar News
News December 13, 2025
15న విశాఖలో వైసీపీ కోటి సంతకాల ర్యాలీ: కేకే.రాజు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమానికి పలు వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని జిల్లా అధ్యక్షుడు కేకే.రాజు అన్నారు. శనివారం YCP కార్యాలయంలో నేతలతో సమావేశమయ్యారు. డిసెంబర్ 15న GVMC గాంధీ విగ్రహం నుంచి మద్దిలపాలెం జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లన్నున్నట్లు తెలిపారు. కోటి సంతకాల ప్రజా ఉద్యమం వినతి పత్రాలను తాడేపల్లికి ఆరోజు పంపనున్నట్లు చెప్పారు.
News December 13, 2025
విశాఖ: ‘అభివృద్ధి చూసి ఓర్వలేకనే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు’

విశాఖలో ఒకేరోజు 9 ఐటీ కంపెనీలకు CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ శంకుస్థాపనలు చేశారు. ఇది రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. శనివారం విశాఖ సర్క్యూట్ హౌస్‌లో ఆయన మాట్లాడారు. విశాఖ అంటే CMకి ప్రత్యేక అభిమానం అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక YCP నేతలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు.
News December 13, 2025
విశాఖ: టెట్ పరీక్షకు 311 మంది గైర్హాజరు

విశాఖలో శనివారం 17 కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 4,501 మంది అభ్యర్థులకు గానూ 4,190 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. డీఈవో ప్రేమ్ కుమార్ ఒక పరీక్ష కేంద్రాన్ని.. ఫ్లైయింగ్ స్క్వాడ్ 4 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో చెప్పారు.


