News December 9, 2025

వంద శాతం ఓటింగ్‌లో పాల్గొనాలి: కలెక్టర్ రాహుల్ రాజ్

image

ప్రజలు వంద శాతం ఓటింగ్‌లో పాల్గొనేలా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మొదటి విడత ఎన్నికల్లో 160 గ్రామ పంచాయతీల్లో 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 144 జీపీలకు 411 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. 1402 వార్డుల్లో 332 ఏకగ్రీవం కాగా, పాపన్నపేటలోని అరికెలలో రెండు వార్డులకు నామినేషన్లు రాలేదన్నారు.

Similar News

News March 10, 2026

సంక్షేమ శాఖ పనితీరు ఆదర్శనీయం: ఐసీడీఎస్ డైరెక్టర్

image

మెదక్ జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ శాఖ పనితీరు ఆదర్శంగా ఉందని ఐసీడీఎస్ డైరెక్టర్ శృతి ఓజా ప్రశంసించారు. సోమవారం ఆమె మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రతిమ సింగ్‌తో భేటీ అయ్యారు. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, జిల్లాలోని కేంద్రాలు, సఖి సెంటర్లలో బాధితులకు, చిన్నారులకు మెరుగైన సేవలు అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

News March 9, 2026

శ్రీ తునికి నల్ల పోచమ్మ అమ్మవారికి ప్రత్యక పూజలు

image

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం శ్రీతునికి నల్ల పోచమ్మకు అర్చకుడు శివప్ప ప్రత్యేక పూజలు చేశారు. నేడు సోమవారం రెండో రోజు బండ్లు తిరుగుట, అలాగే అమ్మవారిని పల్లకీలో ఊరేగించారు. అమ్మవారికి ఒడిబియ్యం, నైవేద్యం సమర్పించి, ధూప దీపాలతో అష్టోత్తర నామాలతో పూజలు చేశారు. పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.