News December 9, 2025

తిరుపతి నుంచి చర్లపల్లికి స్పెషల్ ట్రైన్.. జిల్లాలో స్టాపింగ్ ఇక్కడే!

image

ప్రకాశంలోని పలు రైల్వేస్టేషన్ల మీదుగా ఈనెల 16 నుంచి 30వ తేదీ వరకు ప్రతి మంగళవారం తిరుపతి నుంచి చర్లపల్లి వరకు స్పెషల్ ట్రైన్ (07000) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జిల్లాలోని దిగువమెట్ట, గిద్దలూరు, కంభం, మార్కాపూర్ రోడ్, దొనకొండ రైల్వే స్టేషన్ల మీదుగా రైలు ప్రయాణిస్తుందని, జిల్లా ప్రయాణికులు గమనించాలని పేర్కొంది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో స్పెషల్ ట్రైన్‌ను ఏర్పాటు చేశారు.

Similar News

News December 13, 2025

ప్రకాశం: అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల జాబితా విడుదల

image

ప్రకాశం జిల్లాలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లగా ఎంపికైన 117 మందితో జాబితా విడుదల చేశామని డీఈవో రేణుక తెలిపారు. www.prakasamschooledu.com ద్వారా జాబితా చెక్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 15వ తేదీలోగా కేటాయించిన పాఠశాలల్లో జాయిన్ కావాలని ఆదేశించారు. సంబంధిత హెచ్ఎంలు ప్రతి నెలా 2వ తేదీన డ్యూటీ సర్టిఫికేట్ సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాలన్నారు.

News December 13, 2025

ప్రకాశం జిల్లాలో 5.26 లక్షల సంతకాల సేకరణ

image

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా సేకరించిన సంతకాల పత్రాలను వైసీపీ రాష్ట్ర కార్యాలయానికి సోమవారం తరలిస్తామని దర్శి MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా జిల్లాలో 5.26 లక్షల మంది సంతకాలు చేశారని చెప్పారు. వాటిని ప్రత్యేక వాహనం ద్వారా వైసీపీ ఆఫీసుకు తరలిస్తామన్నారు.

News December 13, 2025

ప్రకాశం: గ్యాస్ ఏజెన్సీలకు నోటీసులు

image

ప్రకాశం జిల్లాలోని 24 గ్యాస్ ఏజెన్సీలకు జేసీ గోపాలకృష్ణ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గ్యాస్ డెలివరీ సమయంలో అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా తేలింది. ఇకపై డెలివరీ బాయ్ ప్రవర్తన, రసీదుకు మించి డబ్బులు ఎక్కువగా వసూలు చేసినా ఉపేక్షించేది లేదని జేసీ హెచ్చరించారు. మీ ఏరియాలో సిలిండర్ డెలివరీకి ఎక్కువ నగదు తీసుకుంటే ఊరిపేరు, ఏజెన్సీ పేరుతో కామెంట్ చేయండి.