News December 9, 2025
MBNR: ‘నవోదయ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి’

నాగర్ కర్నూల్ జిల్లా వట్టెంలోని జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష (డిసెంబర్ 13)ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్ రావు సూచించారు. బిజినేపల్లిలో సెంటర్ సూపరింటెండెంట్లు, పరిశీలకులకు శిక్షణ ఇచ్చారు. 29 కేంద్రాల్లో పరీక్ష ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రిన్సిపాల్ భాస్కర్ కుమార్ తెలిపారు.
Similar News
News January 16, 2026
ఎల్ఐసీ బిల్డింగ్ సమీపంలో వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ఆర్టీసీ కాంప్లెక్స్, ఎల్ఐసీ బిల్డింగ్ మధ్యలో ఉన్న బస్టాప్ వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వయసు 75 సంవత్సరాలు దాటి ఉంటుందని ట్రాఫిక్ ఎస్ఐ సింహాచలం తెలిపారు. వైట్ షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని.. సీసీ ఫుటేజ్‌లు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News January 16, 2026
KNR: కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి క్యాంప్ కార్యాలయంలో గురువారం సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. పల్లె సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో అలంకరించగా, సిబ్బంది పండుగ వాతావరణంలో పాల్గొన్నారు.
News January 16, 2026
స్టీల్ ప్లాంట్: కాలువలో ఉద్యోగి అనుమానాస్పద మృతి

స్టీల్ ప్లాంట్‌లోని కోపరేటివ్ స్టోర్స్‌లో అసిస్టెంట్‌గా పని చేస్తున్న సతీశ్ డీఏవీ పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్న కాలువలో శవమై కనిపించడం కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం కాలువలో మృతదేహం ఉన్నట్లు స్టీల్ ప్లాంట్ పోలీసులకు సమాచారం అందడంంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


