News December 9, 2025
రూ.40వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయండి: CBN

AP: పూర్వోదయ స్కీమ్‌లో భాగంగా ₹40 వేల కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని CBN అధికారులకు సూచించారు. ₹20 వేల కోట్ల చొప్పున నిధులతో సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రకాశం, రాయలసీమలో 20L ఎకరాల్లో ఉద్యాన పంటల్ని విస్తరించాలని చెప్పారు. ₹58,700 CRతో చేపట్టే పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుతో 200 TMCల గోదావరి నీటిని వినియోగించే అవకాశం ఉంటుందన్నారు.
Similar News
News December 13, 2025
మెస్సీ టూర్.. నిర్వాహకుడి అరెస్ట్

కోల్‌కతాలో మెస్సీ టూర్‌లో నెలకొన్న గందరగోళంపై బెంగాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిర్వాహకుడిని అరెస్ట్ చేసింది. టికెట్లు కొని స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్‌కు డబ్బులు రీఫండ్ చేయిస్తోంది. అటు ఘటనపై ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం మిస్‌మేనేజ్‌మెంట్‌కు గల కారణాలపై ఆరా తీస్తోంది. కాగా మెస్సీతో పాటు అభిమానులకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే క్షమాపణలు చెప్పారు.
News December 13, 2025
హనుమాన్ చాలీసా భావం – 37

జై జై జై హనుమాన గోసాయీ|
కృపా కరహు గురు దేవ కీ నాయీ||
గురువు మన అజ్ఞానాన్ని తొలగించి జీవితానికి సరైన మార్గం చూపిస్తారు. అలాగే హనుమంతుడు కూడా ఆ గురువులాగే దయ చూపి మనల్ని కష్టాల కడలి నుంచి తప్పిస్తాడు. ధైర్యాన్ని, సన్మార్గాన్ని ప్రసాదించి, నిరంతరం మనల్ని రక్షిస్తూ విజయం చేకూరేలా ఆశీర్వదిస్తాడు. ఈ శ్లోకం ద్వారా తులసీదాస్ హనుమకు జయం పలికి, ఆయన శక్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నాడు. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 13, 2025
కేరళలోనూ వికసిస్తున్న కమలం!

కేరళ రాజకీయాల్లో BJP ప్రభావం క్రమంగా పెరుగుతోంది. తాజా లోకల్ బాడీ ఎన్నికలలో తిరువనంతపురం కార్పొరేషన్‌లో బీజేపీ నేతృత్వంలోని NDA విజయ ఢంకా మోగించింది. మొత్తం 101 వార్డులలో ఎన్డీయే 50 గెలవగా, LDF 29, UDF 19 సాధించాయి. ఇప్పటికే 2024 LS ఎన్నికల్లో త్రిసూర్ నుంచి నటుడు, BJP నేత సురేశ్ గోపి MPగా గెలిచారు. ఆ పార్టీ ఇప్పుడు కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. ఇది కేరళలో కమలం వికాసాన్ని సూచిస్తోంది.


