News December 10, 2025

ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి: కలెక్టర్

image

ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. పౌర సరఫరా సంస్థ అధికారులతో మంగళవారం ఆయన సమావేశమై మాట్లాడారు. ధాన్యం అధికంగా కొనుగోలు చేసిన రైతు సేవా కేంద్రం సహాయకునికి, పౌరసరఫరాల ఉపతహశీల్దార్, తహశీల్దార్లకు అవార్డులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ అవార్డులను జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఇస్తామన్నారు.

Similar News

News January 16, 2026

జనవరి 16: చరిత్రలో ఈ రోజు

image

1938: మల్ల యుద్ధ వీరుడు కోడి రామమూర్తి మరణం
1942: కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జననం (ఫొటోలో)
1943: సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి చౌదరి మరణం
1978: సినీ దర్శకుడు భీమ్ సింగ్ మరణం
1988: భారత ఆర్థికవేత్త ఎల్.కె.ఝా మరణం
1989: సినీ నటుడు ప్రేమ్ నజీర్ మరణం
2016: బాలీవుడ్ దర్శకుడు అనిల్ గంగూలీ మరణం

News January 16, 2026

జనవరి 30న నీటి వివాదాలపై తొలి కీలక సమావేశం

image

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యల పరిష్కారానికి కీలక అడుగు పడనుంది. AP, TG, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, CWC అధికారులతో కూడిన అధికారిక కమిటీ తొలి సమావేశం జనవరి 30న ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, రెండు రాష్ట్రాల మధ్య నీటి యాజమాన్య వివాదాలపై చర్చ జరగనుంది. KRMB, GRMB ప్రతినిధులు కూడా పాల్గొని తాజా పరిస్థితులపై నివేదికలు సమర్పించనున్నారు.

News January 16, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.