News April 19, 2024

పాలమూరుకు పట్టిన దరిద్రమే కాంగ్రెస్: నిరంజన్ రెడ్డి

image

మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. పాలమూరుకు పట్టిన దరిద్రమే కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. నాలుగున్నర దశాబ్దాలు పాలించి పాలమూరును వలసల జిల్లాగా చేసి, 14 లక్షల మంది వలసలకు కారణం అయిందన్నారు. కేసీఆర్ ప్రమాదవశాత్తు జారిపడిన అంశాన్ని కూడా రాజకీయం చేస్తూ సీఎం స్థాయిలో ఉండి అమర్యాదగా, అగౌరవంగా మాట్లాడడం రేవంత్‌కే చెల్లిందని విమర్శించారు.

Similar News

News December 25, 2024

MBNR: మెదలైన ఎన్నికల సందడి.. యువత ఓటు ఎటు?

image

ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్లలో యువత ఓటును ఆకర్షించడానికి నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ సారి యువత ఓటు అధిక సంఖ్యలో నమోదు కావడంతో స్థానిక నాయకులలో భయం మొదలైంది. యువత మాత్రం అభివృద్ధి వైపే ఓటు వేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓటర్లను ప్రలోభ పెట్టేలా నాయకులు ప్రవర్తిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

News December 24, 2024

MBNR: అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వినతి

image

మహబూబ్‌నగర్ పట్టణంలోని డీసీసీ కార్యాలయం నుంచి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, ఒబేదుల కోత్వాల్, మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News December 24, 2024

MBNR: ఇంటర్ విద్య బలోపేతంపై దృష్టి

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. రాబోయే వార్షిక పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు ఫీల్డ్ ఆఫీసరుగా డీడీ. లక్ష్మారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని జిల్లా ఇంటర్ అధికారులు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలను క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్దిష్ట పరిశీలన, సూచనలతో కూడిన నివేదికను రూపొందిస్తామని అధికారులు తెలిపారు.