News December 10, 2025

పిల్లల పోషణలో ఐసీడిఎస్ కీలకం: కలెక్టర్

image

పిల్లల పోషణ, ఎదుగుదల, ఆరోగ్య ఫలితాలను మెరుగుపర్చడంలో ICDS శాఖ కీలకమని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో CDPOలు, సూపర్వైజర్లతో THR పంపిణీ, గ్రోత్ రిపోర్ట్, పోషణ ట్రాకర్ తదితర అంశాలపై సమీక్ష చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం దేశాభివృద్ధికి పునాదన్నారు. కిట్ల పంపిణీతో పాటు హిమోగ్లోబిన్, హైట్, వెయిట్ పెరుగుదలపై పర్యవేక్షణ చేయాలని సూచించారు.

Similar News

News April 16, 2026

విజయనగరం: సమగ్ర శిక్షా కార్యాలయంలో ఉద్యోగాల భర్తీ

image

విజయనగరం సమగ్ర శిక్షా కార్యాలయంలో ఖాళీగా ఉన్న 8 సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO&APC మాణిక్యం నాయుడు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు దీనికి అర్హులన్నారు. ఏప్రిల్ 22 సా.5 గంటల లోపు జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. vizianagaram.ap.gov.in వెబ్‌సైట్‌‌లో సంబధిత వివరాలు ఉన్నాయని చెప్పారు.

News April 16, 2026

మీ మేనత్తలు ఎవరో నీకు తెలుసా?.. లోకేశ్‌కు YCP కౌంటర్

image

AP: వైఎస్ జగన్ తల్లిని, చెల్లిని తరిమేశారంటూ మంత్రి లోకేశ్ చేసిన <<19664163>>విమర్శలకు<<>> వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ‘మీ మేనత్తలు ఎవరో నీకు తెలుసా? ఏ రోజు అయినా ఇంటికి పిలిచి పట్టెడన్నం పెట్టావా? మీ బాబాయ్ రామ్మూర్తి నాయుడిని ఎందుకు గొలుసులతో కట్టేశారు? మీ నాన్నమ్మ చనిపోతే మీ నాన్న ఎందుకు తలకొరివి కూడా పెట్టలేదు? నువ్వు ఒకటి అంటే మేము పది అనగలం. ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు’ అని వార్నింగ్ ఇచ్చింది.

News April 16, 2026

SRHకు షాక్.. IPL నుంచి మరో బౌలర్ ఔట్

image

IPL: SRH బౌలర్ డేవిడ్ పేన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఆయన కాలి మడమ గాయంతో బాధపడుతున్నట్లు పేర్కొంది. కాగా అంతకుముందు గాయంతో టోర్నీకి దూరమైన జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో <<19463818>>పేన్<<>> జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే.