News December 10, 2025
మెదక్: ఓటేయాలంటే గుర్తింపు కార్డు పక్కా !

ఓటర్లు తమ గుర్తింపు కోసం EPIC కార్డు (ఓటరు ఐడి) లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించిన ఈ క్రింది 18 ప్రత్యామ్నాయ పత్రాల్లో ఏదో ఒకటి చూపించవచ్చు. ఆధార్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ పాస్బుక్(ఫోటోతో), రేషన్ కార్డు(ఫోటోతో), పట్టాదారు పాస్బుక్, MNREGA జాబ్ కార్డు, దివ్యాంగుల ధృవీకరణ పత్రం(ఫోటోతో), పెన్షన్ పత్రాలు మొదలగునవి చూయించాలి.
Similar News
News January 13, 2026
తిరుపతి: 2నెలల జీతాలు విడుదల

ప్రభుత్వ గురుకుల స్కూల్లో ఉద్యోగంలో చేరిన 2025 డీఎస్సీ ఉపాధ్యాయులకు 2నెలల జీతాలు విడుదలయ్యాయి. ప్రాన్ నెంబర్ సమస్యతో ఉద్యోగంలో చేరిన 3నెలల్లో 2నెలలు జీతాలు రాలేదని Way2Newsలో వార్త వచ్చింది. స్పందించిన అధికారులు 1100 మంది ఉపాధ్యాయులకు జీతాలు విడుదల చేశారు.
News January 13, 2026
ఖమ్మం: ఎల్ఐజీ ఫ్లాట్ల దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు

ఖమ్మం శ్రీరాంనగర్లో హౌసింగ్ బోర్డు నిర్మించిన LIGఫ్లాట్ల దరఖాస్తు గడువును జనవరి 20వరకు పొడిగించినట్లు చీఫ్ ఇంజనీర్ జివి రమణారెడ్డి తెలిపారు. అప్రోచ్ రోడ్డు సమస్య పరిష్కారం కావడంతో మరోసారి దరఖాస్తులకు అవకాశం కల్పించామని చెప్పారు. అల్పాదాయవర్గాల కోసం కేటాయించిన ఈఫ్లాట్లకు ఆసక్తి గల వారు మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తుచేసుకోవాలని సూచించారు. జనవరి 23న లాటరీ ద్వారా ఫ్లాట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు.
News January 13, 2026
షాక్స్గామ్పై పాక్-చైనా ఒప్పందం చట్టవిరుద్ధం: ఆర్మీ చీఫ్

షాక్స్గామ్ లోయలో చైనా చేపడుతున్న నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. ‘పాకిస్థాన్-చైనా మధ్య 1963 నాటి ఒప్పందం చట్టవిరుద్ధం. CPEC 2.0పై ఆ దేశాల సంయుక్త ప్రకటనను మేము అంగీకరించం. అక్కడ ఎటువంటి కార్యకలాపాలకు భారత్ అంగీకరించదు. దీనిపై MEA ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది’ అని ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. కాగా కారకోరం శ్రేణికి ఉత్తరాన ఈ లోయ ఉంది.


