News April 19, 2024
పాలకొల్లు: నిమ్మల ‘మూడో’ గండం దాటేనా?

AP: ప.గోదావరి పాలకొల్లుకు ఓ సెంటిమెంట్ ఉంది. అక్కడి ఓటర్లు వరుసగా మూడోసారి ఏ అభ్యర్థినీ గెలిపించలేదు. 1955, 62లో అద్దేపల్లి సత్యనారాయణ(INC), 1983, 85లో అల్లు వెంకట సత్యనారాయణ(TDP), ఈయనే 1994, 99లో 2సార్లు విజయం సాధించారు. 2014, 19లో గెలిచిన నిమ్మల రామానాయుడు(TDP) మరోసారి బరిలో నిలిచారు. మూడో గండాన్ని ఆయన దాటుతారో లేదో వేచి చూడాలి. YCP నుంచి శ్రీహరి గోపాలరావు పోటీ చేస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News November 3, 2025
బస్సు ప్రమాదం.. దిక్కుతోచని స్థితిలో చిన్నారులు

TG: మీర్జాగూడ <<18183773>>ప్రమాదం<<>> పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా ఆమె భర్తకు గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో వారి ముగ్గురు పిల్లలు అదృష్టవశాత్తు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఓవైపు తల్లి మరణం, మరోవైపు ఆసుపత్రిలో తండ్రి ఉండటంతో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఆ చిన్నారులు ఉండిపోయారు. ఈ దృశ్యం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.
News November 3, 2025
తగ్గుతున్న ఆకుకూరల సాగు.. కారణమేంటి?

ఒకప్పుడు చాలా రకాల ఆకుకూరల లభ్యత, వినియోగం ఉండేది. ఇప్పుడు తోటకూర, మెంతి కూర, పాలకూర, పుదీనా, గోంగూర, కొత్తిమీర, బచ్చలికూరలనే మనం ఎక్కువగా వినియోగిస్తున్నాం. ఆకుకూరల సాగులో రైతుల కష్టం ఎక్కువగా ఉండటం, వరద ముంపునకు గురైతే పంట పూర్తిగా నష్టపోవడం వంటి కారణాల వల్ల.. రైతులు ఎక్కువ ధర పలికే కూరగాయలు, ఇతర వాణిజ్య పంటల సాగువైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా కాలక్రమేణా ఆకుకూరల సాగు, వినియోగం తగ్గుతోంది.
News November 3, 2025
శక్తిమంతమైన శివ మంత్రాలు

1. ఓం నమః శివాయ
2. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
3. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్
4. కర్పూర్ గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం
సదావసంతం హృదయారవిందే భవం భవానీసహితం నమామి
5. కరచరణా కృతం వా కాయజం కర్మజం వా
శ్రవన్నయనజం వా మానసం వా పరధాం విహితం విహితం వా
సర్వ మేతత క్షమస్వ జయ జయ కరుణాబ్దే శ్రీ మహదేవ్ శంభో


