News December 10, 2025

VZM: ‘జిల్లాలో ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి’

image

జిల్లాలో వివిధ ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్‌.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం విజయనగరం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిగింది. కేంద్రీయ గిరిజన వర్శిటీ, భోగాపురం విమానాశ్రయం, తోటపల్లి, తారకరామ ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, కుర్ధారోడ్-విజయనగరం మూడో రైల్వే లైన్, కొత్తవలస-విజయనగరం నాలుగో రైల్వే లైన్ భూ సేకరణ స్థితిపై సమీక్షించారు.

Similar News

News January 21, 2026

రాజాం పోలిపల్లి అమ్మవారి జాతర.. షెడ్యూల్ ఇదే

image

రాజాం పోలిపల్లి అమ్మవారి జాతర ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది.
➱ఫిబ్రవరి 20న (శుక్రవారం) అమ్మవారి నేత్రోత్సవం
➱22న (ఆదివారం) జాతర ప్రారంభం
➱23న (సోమవారం) పసుపు, కుంకుమ, ముర్రాటలతో మొక్కులు చెల్లిస్తారు
➱24న (మంగళవారం) రాత్రి గుడిలోకి ఘటాలు రావడంతో జాతర ముగుస్తుంది.
చివరి రోజున వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ కమిటీ అన్నీ ఏర్పాట్లు చేస్తోంది.

News January 21, 2026

VZM: రబీ లక్ష్యం దాటిన ఉద్యాన మిషన్

image

జిల్లాలో రబీ సీజన్‌లో ఉద్యాన సాగు లక్ష్యాన్ని మించి పెరిగిందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. విజయనగరంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. లక్ష్యంగా పెట్టుకున్న 4,000 ఎకరాలకు బదులుగా 4,800 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని చెప్పారు. ఖరీఫ్‌లో మరో 6,000 ఎకరాల్లో ఉద్యాన సాగుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

News January 21, 2026

చీపురుపల్లి, రాజాంలో రెండు MSME పార్కులు

image

చీపురుపల్లి, రాజాం నియోజకవర్గాల్లో కొత్తగా రెండు MSME పార్కుల ఏర్పాటుకు వెంటనే స్థలాలు గుర్తించి భూసేకరణ ప్రారంభించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో వివిధ ప్రాజెక్టులు, పరిశ్రమలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. భోగాపురం విమానాశ్రయం, జాతీయ రహదారి, రైల్వే విస్తరణ, ఫుడ్ పార్కులు, పరిశ్రమల విస్తరణపై సమీక్షించారు.