News December 10, 2025

బ్లాక్ మెయిల్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండండి: DEO

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని DEO వెంకట లక్ష్మమ్మ మంగళవారం సూచించారు. ఎటువంటి కాల్స్ వచ్చినా రికార్డ్ చేయాలన్నారు. వాటిని లిఖితపూర్వకంగా సంబంధిత పోలీసులకు అందజేయాలన్నారు. కాల్స్‌కు భయపడి ఎవరికి నగదు చెల్లించవద్దని పేర్కొన్నారు.

Similar News

News March 3, 2026

తల్లిదండ్రులకు అలర్ట్.. ఈ నంబర్‌కు కాల్ చేయండి!

image

పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘టెలీ మానస్’ సేవలను నిర్వహిస్తోంది. విద్యార్థులు పరీక్షల భయం, ఆందోళన లేదా ఇతర మానసిక సమస్యలతో బాధపడుతుంటే ‘14416’ అనే టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఉచితంగా నిపుణుల సలహాలు పొందవచ్చు. ఈ సేవలు 20కి పైగా భాషల్లో 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనిస్తూ ఉండాలి. SHARE IT

News March 3, 2026

WGL: దట్టమైన అడవుల్లో జింకలు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో అరణ్య ప్రాంతాల మార్గంలో ప్రయాణం చేస్తుంటే జింకల గుంపులు ప్రత్యక్షమై చెంగుచెంగున ఎగురుతూ వెళ్లేవి. ప్రస్తుతం ఎక్కడ చూసినా జింకలు కనిపించడం లేదు. పోడు సాగు, చెట్ల నరికివేత, గుట్టలు పిండి చేయడంతో అడవుల విస్తీర్ణం తగ్గిపోయి అవి దట్టమైన అడవుల్లోకి వెళ్లిపోయి స్థిర నివాసం ఏర్పరచుకున్నాయని వన్యప్రాణి ప్రేమికులు పరిశోధించి చెబుతున్నారు.
# నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం

News March 3, 2026

రేపు ఆన్‌లైన్ క్విజ్: డీఈవో నాగేశ్వరరావు

image

జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో సైన్స్ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని డీఈఓ నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. బుధవారం ఉదయం 9:30 గంటలకు 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. 22 మండలాల నుంచి ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల జట్లు ఇందులో పాల్గొంటాయి. ప్రతిభ కనబరిచిన ఆరు టీములు ఈ నెల 6న జరిగే జిల్లా స్థాయి ఫైనల్స్‌కు ఎంపికవుతాయని ఆయన వెల్లడించారు.