News December 10, 2025
మా దేశం పేరు సంస్కృతం నుంచే వచ్చింది: సింగపూర్ మాజీ డిప్యూటీ PM

సింగపూర్ లేదా సింగపురా అనే పేరు సంస్కృతం నుంచి ఉద్భవించిందని ఆ దేశ మాజీ ఉప ప్రధాని తియో చీ హియాన్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన అటల్ బిహారీ వాజ్‌పేయి మెమోరియల్ లెక్చర్‌లో ఆయన మాట్లాడుతూ భారత్-సింగపూర్ చారిత్రక అనుబంధం గురించి వెల్లడించారు. 1867 వరకు కోల్‌కతా నుంచి సింగపూర్ పరిపాలన జరిగిందని గుర్తుచేశారు. తమ దేశ ఆర్థిక, సాంస్కృతిక నిర్మాణంలో భారతీయులు కీలకపాత్ర పోషించారని కొనియాడారు.
Similar News
News January 12, 2026
20 రోజుల్లో ఉద్యోగులకు గుడ్‌న్యూస్

AP: ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికను రూపొందించింది. మరో 20 రోజుల్లో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని CS విజయానంద్ అత్యవసర మెమో జారీ చేశారు. ఈ నెల 21వ తేదీలోపు HODలు ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. 29 నాటికి డీపీసీ పూర్తిచేసి, 31లోపు పదోన్నతుల జీవోలు జారీ చేయాలని ఆదేశించారు. ఇకపై ప్రతి ఏడాది ఇదే షెడ్యూల్ పాటించాలని స్పష్టం చేశారు.
News January 12, 2026
ఈకల రంగును బట్టి కోళ్ల జాతిని గుర్తిస్తారు

ఈకల రంగుని బట్టి కోడిపుంజు రకాలను, జాతులను గుర్తిస్తారు. నల్ల ఈకలుంటే “కాకి”, తెల్లని ఈకలుంటే “సేతు” అని, మెడపై నలుపు, తెలుపు ఈకలు సమానంగా ఉంటే “పర్ల”, ఈకలు మొత్తం ఎర్రగా ఉంటే ‘డేగ’ అని, రెక్కల పై లేదా వీపుపై పసుపు రంగు ఈకలు ఉంటే దానిని “నెమలి” అని పిలుస్తారు. ఇంకా మూడు రంగుల ఈకలు, నలుపు, ఎరుపు, పసుపు రంగుల్లో సమానంగా ఉంటే దానిని “కౌజు” అని, ఈకలు లేత బంగారు రంగులో ఉంటే ‘అబ్రాసు’ అంటారు.
News January 12, 2026
నెలాఖరులోగా SLBC పనులు ప్రారంభించాలి: మంత్రి ఉత్తమ్

TG: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగ పనులను ఈ నెలాఖరులోగా తిరిగి ప్రారంభించాలని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. <<18806199>>టన్నెల్ బోరింగ్ మెషీన్<<>>ను తొలగించిన నేపథ్యంలో డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో (DBM) పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. పెండింగ్ బిల్లుల్లో కొంత మొత్తాన్ని వారం రోజుల్లోగా చెల్లిస్తామని నిర్మాణ సంస్థకు హామీ ఇచ్చారు.


