News April 19, 2024
FB, ఇన్‌స్టా, వాట్సాప్ యూజర్లకు సూపర్ న్యూస్
FB మాతృసంస్థ మెటా AI రంగంలోకి అడుగుపెట్టింది. FB, మెసెంజర్, వాట్సాప్, ఇన్‌స్టాలో దీన్ని ప్రవేశపెట్టింది. దీని సాయంతో రియల్ టైమ్ ఇమేజ్‌లను రూపొందించి ఇతరులకు పంపొచ్చు. మనం టెక్ట్స్ రూపంలో ఇచ్చే సూచనల ఆధారంగా క్వాలిటీ ఫొటోలు జనరేట్ అవుతాయి. AI చాట్‌బాట్‌లో ఏ ప్రశ్నకైనా ఆన్సర్ తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ IND సహా పలు దేశాల్లో కొందరికి అందుబాటులోకి వచ్చిందని, త్వరలో అందరూ వాడుకోవచ్చని సంస్థ తెలిపింది.
Similar News
News November 19, 2024
‘కాళేశ్వరం’పై విచారణ.. ఈనెలాఖరున KCRకు పిలుపు!
TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ పీసీ ఘోష్ ఎల్లుండి HYD రానున్నారు. తొలుత ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పనిచేసిన అధికారులు ఎస్కే జోషి, సోమేశ్‌కుమార్, రజత్‌కుమార్, స్మితా సబర్వాల్, రామకృష్ణారావును క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఆ తర్వాత ఈనెలాఖరున లేదా DEC తొలివారంలో KCR, హరీశ్ రావును విచారణకు పిలవనున్నట్లు సమాచారం. అయితే KCR విచారణకు వెళ్తారా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది.
News November 19, 2024
భారత్ ఫైబర్ (BSNL)పై పెరుగుతోన్న ఆసక్తి!
BSNLలో 5G అందుబాటులోకి వస్తుండటంతో ప్రజలు ఈ నెట్‌వర్క్‌లోకి మారేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో రోజురోజుకీ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతోంది. అలాగే భారత్ ఫైబర్ (తక్కువ ధరకే WiFi)పైనా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దేశంలో మొత్తం 28.8 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. కేరళ, తమిళనాడులోనే దాదాపు 9లక్షల కనెక్షన్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక APలో 1.7లక్షలు, TGలో 0.9లక్షల కనెక్షన్లున్నాయి.
News November 19, 2024
ఇందిరా గాంధీకి మోదీ నివాళి
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి అర్పించారు. అలాగే రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగానూ ఆయన ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆమె చూసిన ధైర్యసాహసాలు ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకమని మోదీ కొనియాడారు. కష్టకాలంలో ఆమె నాయకత్వం నిజమైన సంకల్పం ఏమిటో చూపించిందన్నారు.