News December 10, 2025

TG గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా సిరిసిల్ల చీర

image

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో నల్లా విజయ్ ప్రత్యేకంగా ప్రదర్శించిన అగ్గిపెట్టెలో ఇమిడిపోయే సిరిసిల్ల చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంగళవారం హైదరాబాద్‌లో హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్, హ్యాండ్ క్రాఫ్ట్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాల్‌లో విజయ్ ఈ చీరను ప్రదర్శించగా సమ్మిట్‌లో పాల్గొన్న వ్యాపారవేత్తలు దీనిని ఆసక్తిగా తిలకించారు. చీరకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News March 31, 2026

‘3-2-1’ బ్యాకప్ రూల్‌తో మీ డేటా సేఫ్!

image

ఈ డిజిటల్ యుగంలో ముఖ్యమైన సమాచారం సేఫ్‌గా ఉండాలంటే బ్యాకప్ తప్పనిసరి. ఇందుకు 3-2-1 రూల్ ఫాలో అయితే మంచిదంటున్నారు నిపుణులు. ఓరిజినల్ డేటా కాక మరో రెండు అంటే మొత్తం 3 కాపీలు ఉండాలి. రెండు వేర్వేరు స్టోరేజీల్లో ఈ డేటా సేవ్ చేయాలి. మీ సిస్టమ్‌లో ఒకటి ఉంటే మరోటి హార్డ్‌డ్రైవ్‌లో పెట్టుకోవాలి. ఇక మరో కాపీ క్లౌడ్ సర్వర్‌లో స్టోర్ చేసుకోవాలి. దీంతో డేటా నష్టాన్ని నివారించొచ్చు. ఈరోజు వరల్డ్ బ్యాకప్ డే.

News March 31, 2026

జనగణన: మే1 నుంచి ఏపీలో, 16 నుంచి TGలో

image

జనగణన ప్రక్రియ AP, TGలో మే నుంచి ఆరంభం కానుంది. ముందుగా ఇళ్ల సర్వే ఏపీలో మే 1-30 వరకు, TGలో మే11-JUN9 వరకు ఉంటుంది. ఇక సెల్ఫ్ ఎన్యూమరేషన్ APలో మే16-30 తేదీల్లో, TGలో APR 26-మే10 తేదీ మధ్య జరుగుతుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్లో ప్రజలు ఇళ్ల సమాచారాన్ని సెన్సస్ వెబ్‌సైట్లో నమోదు చేయొచ్చు. ఇళ్ల సర్వేలో 34 ప్రశ్నలు అడుగుతారు. సెన్సెస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ ఇవాళ మీడియా భేటీలో వీటిని వెల్లడించారు.

News March 31, 2026

రేపటి నుంచి ఇంటర్ క్లాసులు

image

AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రేపటి నుంచి ఇంటర్ సెకండియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఉ.8 నుంచి మ.12:30 వరకు బోధన ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇంటికి పంపుతారు. ఏప్రిల్ 23 వరకు తరగతులు కొనసాగుతాయి. ఆ తర్వాత వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 1 నుంచి కాలేజీలు పున:ప్రారంభమవుతాయి. కాగా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్, ఎగ్జామ్స్ జరిగిన విషయం తెలిసిందే.