News December 10, 2025
నిజామాబాద్: ఈనెల 14న ఉద్యోగ మేళా

ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఈనెల 14న HCL టెక్ బీ ఉద్యోగ మేళా నిర్వహిస్తోందని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవి కుమార్ తెలిపారు. 2024-25లో ఇంటర్‌లో 75 శాతం మార్కులు, మ్యాథ్స్ 60శాతం మార్కులు సాధించిన వారు అర్హులని, నగరంలోని వెంకటేశ్వర కంప్యూటర్ ఇన్స్టిట్యూట్‌లో నిర్వహించనున్న జాబ్ మేళాకు విద్యార్థులు హాజరుకావాలని, పూర్తి వివరాల కోసం 80740 65803ను సంప్రదించాలని సూచించారు.
Similar News
News January 8, 2026
నిజామాబాద్: PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జన్నారపు రాజేశ్వర్

PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా NZBకు చెందిన జన్నారపు రాజేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరంగల్‌లో 3 రోజుల పాటు నిర్వహించిన PDSU 23వ రాష్ట్ర మహాసభల్లో ఆయన్ను ఎన్నుకున్నారు. జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ.. జిల్లాలో విద్యా వ్యతిరేక విధానాలపై, విద్యా రంగ సమస్యలపై విద్యార్థి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామన్నారు. స్థానిక సమస్యలపై నిరంతరం పోరాడుతనని పేర్కొన్నారు.
News January 8, 2026
NZB: ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

నిజామాబాద్ వినాయకనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ గురువారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట అగ్ని మాపక అధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
News January 8, 2026
నిజామాబాద్: బయ్యర్ – సెల్లర్ మీటింగ్‌లో పసుపు బోర్డు ఛైర్మన్

మైసూర్‌లో జరిగిన బయ్యర్-సెల్లర్ మీటింగ్‌లో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆశలు, ఆశయాలకు కొత్త దిశ చూపిన హృదయస్పర్శి సమావేశంగా నిలిచిందన్నారు. తమ పంటలకు గిట్టుబాటు ధరలు, భవిష్యత్ మార్కెట్ అవకాశాలపై ఆశతో పెద్ద ఎత్తున హాజరైన రైతులు ఈ సమావేశానికి ప్రాణం పోశారని కొనియాడారు.


