News April 19, 2024
ఐదేళ్లలో ఎన్నోసార్లు అబార్షన్: కిరణ్ రావు
పెళ్లైన తొలి ఐదేళ్లలో తనకు ఎన్నో సార్లు గర్భస్రావమైందని బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ భార్య, దర్శకనిర్మాత కిరణ్ రావు తెలిపారు. ‘అప్పట్లో పిల్లలు కావాలని చాలా ప్రయత్నించా. కానీ అబార్షన్ల వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నది. పిల్లలను పొందడం ఇంత కష్టమా అని అప్పుడు అనిపించింది’ అని ఆమె చెప్పారు. కాగా ఆమిర్-కిరణ్‌కు ఐవీఎఫ్-సరోగసి పద్ధతి ద్వారా 2011లో ఆజాద్ అనే కుమారుడు జన్మించారు.
Similar News
News November 19, 2024
ఒత్తిడి, ఆందోళన తగ్గాలంటే ఇలా చేయండి!
అతిగా ఆలోచించి <<14648968>>చింతించడం<<>> కూడా ఓ ఆరోగ్య సమస్యేనని వైద్యులంటున్నారు. ఇది మిమ్మల్ని ప్రతికూల విషయాలపై దృష్టి సారించేలా చేస్తుంది. దీనిని అధిగమించాలంటే ఇష్టమైన ఆహారం తీసుకోవాలి. దీని వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. ఒంటరిగా ఉండకుండా అందరితో కలిసి ఉండండి. రోజూ యోగా చేయండి. కంటినిండా నిద్రపోండి. వీలైనంత వరకూ మొబైల్‌కు దూరంగా ఉండండి. సక్సెస్ స్టోరీ బుక్స్ చదవండి. హ్యాపీగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి.
News November 19, 2024
‘కాళేశ్వరం’పై విచారణ.. ఈనెలాఖరున KCRకు పిలుపు!
TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ పీసీ ఘోష్ ఎల్లుండి HYD రానున్నారు. తొలుత ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పనిచేసిన అధికారులు ఎస్కే జోషి, సోమేశ్‌కుమార్, రజత్‌కుమార్, స్మితా సబర్వాల్, రామకృష్ణారావును క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఆ తర్వాత ఈనెలాఖరున లేదా DEC తొలివారంలో KCR, హరీశ్ రావును విచారణకు పిలవనున్నట్లు సమాచారం. అయితే KCR విచారణకు వెళ్తారా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది.
News November 19, 2024
భారత్ ఫైబర్ (BSNL)పై పెరుగుతోన్న ఆసక్తి!
BSNLలో 5G అందుబాటులోకి వస్తుండటంతో ప్రజలు ఈ నెట్‌వర్క్‌లోకి మారేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో రోజురోజుకీ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతోంది. అలాగే భారత్ ఫైబర్ (తక్కువ ధరకే WiFi)పైనా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దేశంలో మొత్తం 28.8 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. కేరళ, తమిళనాడులోనే దాదాపు 9లక్షల కనెక్షన్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక APలో 1.7లక్షలు, TGలో 0.9లక్షల కనెక్షన్లున్నాయి.