News December 10, 2025
‘తుంగతుర్తిలో బెదిరింపులు, దాడులు అధికమయ్యాయి’

నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో హత్యకు గురైన BRS కార్యకర్త ఉప్పల మల్లయ్య పార్థివ దేహానికి సూర్యాపేట ఏరియా ఆసుపత్రి వద్ద మాజీ మంత్రి, MLA జగదీష్ రెడ్డి, మాజీ MLA గాదరి కిషోర్ కుమార్, మాజీ MP లింగయ్య యాదవ్ నివాళులు అర్పించారు. జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో అరాచకాలు పెరిగాయని, తుంగతుర్తిలో బెదిరింపులు, దాడులు అధికమయ్యాయని, మల్లయ్య హత్య ప్రజల్లో భయాందోళనలు రేపుతోందన్నారు
Similar News
News December 10, 2025
విజయవాడ: చిన్నారులకు కిడ్స్ ట్రాకింగ్ బ్యాండ్లు

భవానీ దీక్షల విరమణ కార్యక్రమం కోసం భక్తుల భద్రత నిమిత్తం 4వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల భద్రత కోసం ప్రత్యేకంగా కిడ్స్ ట్రాకింగ్ రిస్ట్ బ్యాండ్లను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 270 సీసీ కెమెరాలకు అదనంగా 50 కెమెరాలను జోడించి, మొత్తం 320 సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రతను పటిష్ఠం చేశారు.
News December 10, 2025
6 మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికలు నేపథ్యంలో ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టర్ రాజర్షి షా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ప్రచారం ముగిసిన వెంటనే 6 మండలాల్లోని మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూసివేయాలని సూచించారు.
News December 10, 2025
సిరిసిల్ల: ఓటు చోరీకి మద్దతుగా 27వేల సంతకాల సేకరణ

టీపీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు ఓటు చోరీ కార్యక్రమానికి మద్దతుగా జిల్లాలో 27 వేల సంతకాలను సేకరించినట్లు డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఓట్ చోరీ జరిగిందని నిరూపిస్తూ సేకరించిన సంతకాలను గాంధీభవన్లో అప్పగించామని పేర్కొన్నారు. ఓట్ చోరీ జరిగిన విషయం రాష్ట్రపతి వరకు చేరవేసేందుకు రాహుల్ గాంధీ చేపట్టిన కార్యక్రమానికి జిల్లా ప్రజలు మద్దతు తెలిపారని ఆయన వెల్లడించారు.


