News April 19, 2024

రోహిత్‌శర్మ గురించి నేనలా అనలేదు: ప్రీతీ జింటా

image

రోహిత్ శర్మను ఎంత ఖర్చు చేసైనా పంజాబ్ టీమ్ కెప్టెన్‌గా తీసుకొస్తానని తాను చెప్పినట్లుగా వచ్చిన వార్తలు ఫేక్ అని ఆ జట్టు ఓనర్ ప్రీతీ జింటా స్పష్టం చేశారు. ‘నేను రోహిత్‌కు బిగ్ ఫ్యాన్. అతన్ని చాలా గౌరవిస్తా. కానీ అతని గురించి నేను ఏ ఇంటర్వ్యూలో మాట్లాడలేదు. మా జట్టు కెప్టెన్ ధవన్ అంటే కూడా నాకు చాలా గౌరవం. ప్రస్తుతం మా టీమ్ బాగుంది. నా దృష్టంతా ఈ సీజన్ గెలవడంపైనే ఉంది’ అని ఆమె ట్వీట్ చేశారు.

Similar News

News March 11, 2026

వేట్లపాలెం ఘటనపై CM సీరియస్

image

CM చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. సమావేశం ప్రారంభం కాగానే వేట్లపాలెం ఘటనపై CM తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్ జిల్లాకు సంబంధించిన సమగ్ర సమాచారంతో ఈ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కలెక్టర్ రెండు రోజుల పాటు ఈ సమావేశంలో పాల్గొని జిల్లా అభివృద్ధి, పాలనాంశాలపై నివేదికలు సమర్పించనున్నారు.

News March 11, 2026

వార్ ఎఫెక్ట్.. హోటళ్లు, హాస్టళ్లలో ఇదీ పరిస్థితి!

image

TG: హైదరాబాద్‌లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు, హాస్టళ్లు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. సరఫరా తగ్గడంతో ఇప్పటికే పలు హోటళ్లు మెనూను కుదించగా, కొన్ని చోట్ల ధరలు పెరిగాయి. అటు హాస్టళ్లలో దోశ, పూరీ వంటి వంటకాలను నిలిపివేసి, భోజనం మాత్రమే అందిస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భోజనం పెట్టలేమని, వసతి మాత్రమే కల్పిస్తామని యజమానులు హెచ్చరిస్తుండటంతో విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

News March 11, 2026

SBI ఫెలోషిప్: ₹1.1 లక్షల గ్రాంట్.. నెలకు ₹21,000

image

SBI ‘యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్’ కోసం అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది. రూరల్ కమ్యూనిటీస్, NGOలతో కలిసి 13 నెలలు పనిచేయాల్సి ఉంటుంది. డిగ్రీ కంప్లీట్ చేసి 21-32 ఏళ్ల వయసున్న వాళ్లు అర్హులు. నెలకు ₹21 వేల అలవెన్సులతో పాటు ఫెలోషిప్ పూర్తైన తర్వాత ₹1,10,000 గ్రాంట్ అందజేస్తారు. ఆన్‌లైన్ అసెస్‌మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్ట్ చేస్తారు. ఏప్రిల్ 30 వరకు <>అప్లై<<>> చేసుకోవచ్చు.