News April 20, 2024
జిల్లా వ్యాప్తంగా 20 నామినేషన్లు దాఖలు: కలెక్టర్

తిరుపతి జిల్లా పరిధిలోని ఒక పార్లమెంటు స్థానానికి మూడు నామినేషన్లు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 17 నామినేషన్లు వచ్చినట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు 24 నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేశారన్నారు. నామినేషన్ల పురస్కరించుకొని నియోజకవర్గాల్లోని ఆర్వో కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఈనెల 25 వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతుందన్నారు.
Similar News
News January 1, 2026
చిత్తూరు: స్వచ్ఛ రథం కోసం దరఖాస్తులు

చిత్తూరు జిల్లాలో స్వచ్ఛరథం ఆపరేటర్లకు ప్రభుత్వం నెలకు రూ.25వేలు ఇస్తుంది. అతను ఇంటింటికీ తిరిగి KG ఇనుము, స్టీల్ వస్తువులు రూ.20, పేపర్లు రూ.15, గాజు సీసా రూ.2చొప్పున కొనుగోలు చేయాల్సి ఉంటుంది. చెత్త తీసుకుని దానికి తగిన సరకులు ఇవ్వాలి. జనవరి 4లోపు MPDO ఆఫీసులో అప్లికేషన్లు ఇస్తే 9న ఎంపిక చేస్తారు. బంగారుపాళ్యం, చిత్తూరు రూరల్, ఐరాల మండలాల్లో అవకాశం ఉందని జడ్పీ CEO రవికుమార్ నాయుడు చెప్పారు.
News January 1, 2026
చిత్తూరులో స్కాం.. అజ్ఞాతంలోకి వ్యాపారులు

జీఎస్టీ చీఫ్ కమిషనర్ ఆదేశాలతో చిత్తూరు జిల్లాలో జీఎస్టీ స్కాంపై అధికారులు చర్యలు మొదలుపెట్టారు. కలెక్టర్, ఎస్పీని మంగళవారం కలిసి కుంభకోణంపై చర్చించినట్లు తెలుస్తోంది. స్క్రాప్ స్కామర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్పీని, కలెక్టర్‌ను కోరినట్లు సమాచారం. దీంతో సంబంధిత స్క్రాప్ వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
News January 1, 2026
చిత్తూరు జిల్లాలో రూ.14 కోట్ల మందు తాగేశారు..!

చిత్తూరు జిల్లాలో డిసెంబరు 30న 7,500 బాక్సుల మద్యం, 2,500 బాక్సుల బీర్లు అమ్ముడయ్యాయి. వీటి ద్వారా రూ.5.05 కోట్ల ఆదాయం వచ్చింది. 31వ తేదీన 4,900 మద్యం, 2400 బీరు బాక్సులు అమ్మడంతో రూ.3.78 కోట్లు సమకూరింది. బార్లలో రూ.2 కోట్లకు పైగా అమ్మకాలు జరగడంతో మొత్తంగా రెండు రోజులకు రూ.10.83 కోట్ల ఆదాయం చేకూరింది. జనవరి 1న రూ.2 కోట్లకు పైగా అమ్మకాలు జరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.


