News December 10, 2025

పరువు హత్య కేసులో సంచలన విషయాలు

image

AP కృష్ణా జిల్లాకు చెందిన <<18523409>>శ్రవణ్<<>> సాయి(19) HYD శివారు మైసమ్మగూడలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. కొన్నాళ్లుగా టెన్త్ క్లాస్‌మేట్‌తో ప్రేమలో ఉన్నాడు. విషయం అమ్మాయి పేరెంట్స్‌కు తెలిసి హెచ్చరించారు. అయినా వినకపోవడంతో పెళ్లి గురించి మాట్లాడదామని అమ్మాయి తల్లి అతడిని ఇంటికి పిలిచింది. అక్కడ గొడవ జరగ్గా సాయిని బ్యాటుతో కొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు.

Similar News

News December 13, 2025

మెస్సీ టూర్.. నిర్వాహకుడి అరెస్ట్

image

కోల్‌కతాలో మెస్సీ టూర్‌లో నెలకొన్న గందరగోళంపై బెంగాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిర్వాహకుడిని అరెస్ట్ చేసింది. టికెట్లు కొని స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్‌‌కు డబ్బులు రీఫండ్ చేయిస్తోంది. అటు ఘటనపై ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం మిస్‌మేనేజ్‌మెంట్‌కు గల కారణాలపై ఆరా తీస్తోంది. కాగా మెస్సీతో పాటు అభిమానులకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే క్షమాపణలు చెప్పారు.

News December 13, 2025

హనుమాన్ చాలీసా భావం – 37

image

జై జై జై హనుమాన గోసాయీ|
కృపా కరహు గురు దేవ కీ నాయీ||
గురువు మన అజ్ఞానాన్ని తొలగించి జీవితానికి సరైన మార్గం చూపిస్తారు. అలాగే హనుమంతుడు కూడా ఆ గురువులాగే దయ చూపి మనల్ని కష్టాల కడలి నుంచి తప్పిస్తాడు. ధైర్యాన్ని, సన్మార్గాన్ని ప్రసాదించి, నిరంతరం మనల్ని రక్షిస్తూ విజయం చేకూరేలా ఆశీర్వదిస్తాడు. ఈ శ్లోకం ద్వారా తులసీదాస్ హనుమకు జయం పలికి, ఆయన శక్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నాడు. <<-se>>#HANUMANCHALISA<<>>

News December 13, 2025

కేరళలోనూ వికసిస్తున్న కమలం!

image

కేరళ రాజకీయాల్లో BJP ప్రభావం క్రమంగా పెరుగుతోంది. తాజా లోకల్ బాడీ ఎన్నికలలో తిరువనంతపురం కార్పొరేషన్‌లో బీజేపీ నేతృత్వంలోని NDA విజయ ఢంకా మోగించింది. మొత్తం 101 వార్డులలో ఎన్డీయే 50 గెలవగా, LDF 29, UDF 19 సాధించాయి. ఇప్పటికే 2024 LS ఎన్నికల్లో త్రిసూర్ నుంచి నటుడు, BJP నేత సురేశ్ గోపి MPగా గెలిచారు. ఆ పార్టీ ఇప్పుడు కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. ఇది కేరళలో కమలం వికాసాన్ని సూచిస్తోంది.