News April 20, 2024
MBNR: రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా ఎంపీ సీటు

సీఎం రేవంత్ రెడ్డికి MBNR ఎంపీ సీటు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. పార్లమెంట్ ఇన్చార్జిగా కొనసాగుతున్న సీఎం.. వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. మరోవైపు ఈ స్థానంపై బిజెపి సైతం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి తీరాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. కాగా ఈ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ గెలిచింది.
Similar News
News April 23, 2025
నారాయణపేట: బాలికపై అత్యాచారం.. జైలుకు యువకుడు

NRPT జిల్లా దామరగిద్ద వాసి <<16176540>>బోయిని శ్రీనివాస్(24)<<>> ఓ బాలికను HYDలోని ఓ కిరాయి రూమ్‌కి తీసుకెళ్లి అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని కోస్గి సీఐ సైదులు తెలిపారు. విచారణ చేపట్టిన అనంతరం నిందితుడిని పట్టుకుని కోస్గి న్యాయస్థానంలో హాజరుపరిచామన్నారు. కోర్టు నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించిందని చెప్పారు. అతడిని MBNR సబ్ జైలుకు తరలించామన్నారు.
News April 23, 2025
గద్వాల: ఇంటర్ FAIL అవుతానేమోనని చనిపోయాడు.. కానీ పాసయ్యాడు!

ఓ ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గద్వాల జిల్లా మల్దకల్(M) మల్లెందొడ్డికి చెందిన వినోద్(18) గద్వాల GOVT జూనియర్ కాలేజీలో ఇంటర్ 1st YEAR చదువుతున్నాడు. తాను పరీక్షల్లో ఫెయిల్ అవుతానని భయంతో ఇటీవల పురుగు మందు తాగగా చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. అయితే మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో వినోద్ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు.దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
News April 23, 2025
బాలానగర్: ‘8 K.M నడిచి.. 434 మార్కులు సాధించిన గిరి పుత్రిక’

బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ విభాగంలో హేమలత.. 434/440 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు నిరుపేదలు. వ్యవసాయం జీవనం సాగిస్తున్నారు. హేమలత ప్రతిరోజు.. కళాశాలకు ఉదయం 4 కి.మీ, సాయంత్రం 4.K.M నడుస్తూ.. కళాశాలకు వచ్చి చదువుకొని అత్యధిక మార్కులు సాధించడంతో కళాశాల ప్రిన్సిపల్ రమేష్ లింగం, కళాశాల యాజమాన్యం సంతోషం వ్యక్తం చేశారు.