News December 10, 2025

కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర శోభ

image

విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీచక్రనవావర్ణార్చన, లక్ష్మీహోమం జరిగాయి. గురువారంభక్తుల రద్దీ దృష్ట్యా పూజా సమయాలను కుదించినట్లు ఈవో తెలిపారు. భక్తులు ఆన్‌లైన్, వాట్సాప్ (9552300009) ద్వారా దర్శనం, ప్రసాదం బుక్ చేసుకోవచ్చు. డిసెంబర్ 19 వరకు ఆర్జిత సేవలు రద్దు చేశామని, వీఐపీలు, వృద్ధులు నిర్ణీత సమయాల్లోనే రావాలని కోరారు.

Similar News

News January 3, 2026

విశాఖ: సొంత భవనంలోకి NIO ప్రాంతీయ కార్యాలయం

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫి విశాఖ ప్రాంతీయ కార్యాలయం త్వరలో సొంత భవనంలోకి మారనుంది. సముద్ర తీర పరిశోధనల కోసం 1976 నుంచి పెదవాల్తేరు బస్‌ డిపో సమీపంలో అద్దె భవనంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా బీచ్‌ రోడ్డులోని రాడిసన్ బ్యూ రిసార్ట్ సమీపంలో 3 ఎకరాల్లో నూతన భవన నిర్మాణం పూర్తయింది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనాన్ని త్వరలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News January 3, 2026

విశాఖ: న్యూఇయర్ రోజు మర్డర్.. కారణం ఇదేనా?

image

విశాఖ జిల్లా కాకానినగర్‌లో న్యూఇయర్ రోజు <<18740809>>దారుణ హత్య <<>>జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎయిర్‌పోర్ట్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న దిలీప్‌ తమను తిట్టాడనే కారణంతో ఈ ఇద్దరు యువకులు కర్రలతో దాడి చేసి చంపినట్లు సమాచారం. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలుకోణాల్లో విచారిస్తున్నట్లు సీఐ శంకర్ నారాయణ శనివారం తెలిపారు.

News January 3, 2026

విశాఖ జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

విశాఖ జిల్లాలో 20 ఉద్యోగాలకు ప్రభుత్వం <>నోటిఫికేషన్<<>> ఇచ్చింది. కేజీబీవీ టైప్-3 విభాగంలో 06, టైప్-4 విభాగంలో 14 నాన్ టీచింగ్ పోస్టింగ్‌లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.