News December 11, 2025
వేములవాడ: పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని 76 సర్పంచ్, 519 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్ మండలాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయగా, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు.
Similar News
News January 11, 2026
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA అంచనా వేసింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
News January 11, 2026
జగిత్యాల: ముగిసిన కేజీబీవీ వార్డెన్ల శిక్షణా తరగతులు

జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల కేజీబీవీ, మోడల్ స్కూల్ వసతి గృహాల వార్డెన్లకు నిర్వహించిన 5 రోజుల శిక్షణ ఆదివారంతో ముగిసింది. జగిత్యాలలోని ఆర్కే కన్వెన్షన్ హాలులో జరిగిన ముగింపు వేడుకలో సైకాలజీ నిపుణుడు శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. విద్యార్థినుల మానసిక స్థితిగతులను అర్థం చేసుకోవాలని, వార్డెన్లు తమ పని ఒత్తిడిని ఎలా అధిగమించాలో వివరించారు.
News January 11, 2026
ఉమ్మడి ఆదిలాబాద్‌పై గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్

HYDలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఉమ్మడి జిల్లా నేతలతో కలిసి ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండి మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలన్నారు.


