News April 20, 2024
నాగర్ కర్నూల్‌ను వ్యవసాయ హబ్‌గా మారుస్తా: ప్రవీణ్ కుమార్

పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని వ్యవసాయ హబ్‌గా మారుస్తానని BRS అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా అపరిస్కృతంగా ఉన్న ఈ ప్రాంత సమస్యలను శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కల్వకుర్తి, డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు.
Similar News
News September 13, 2025
MBNR: యూరియా పంపిణీపై కలెక్టర్ ఆదేశం

జిల్లాలోని ప్రతి రైతుకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు వచ్చిన 600 మెట్రిక్ టన్నుల యూరియాను అన్ని ప్రాంతాలకు వెంటనే సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పాల్గొన్నారు.
News September 12, 2025
MBNR: ‘ఉర్దూ ఘర్’ నిర్మాణాన్ని ఆపాలని జేఏసీ నాయకుల డిమాండ్

MBNRలోని స్థానిక అంబేడ్కర్ కళా భవనం పక్కన ప్రభుత్వం నిర్మిస్తోన్న ఉర్దూ ఘర్‌తో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలంగాణ జేఏసీ MBNR శాఖ నాయకులు అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిటీ సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇబ్బందిగా ఉంటుందని, ఆ భవన నిర్మాణాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం HYDలోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యను వారు కలిసి వినతిపత్రం ఇచ్చారు.
News September 12, 2025
MBNR: OCT 16న PUలో స్నాతకోత్సవం

పాలమూరు యూనివర్సిటీలో వచ్చేనెల 16న 4వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారిణి కె.ప్రవీణ Way2Newsతో తెలిపారు. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ కోర్స్‌లలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు అన్ని కోర్సుల్లో 88 గోల్డ్ మెడల్స్ అందించనున్నారు. ఈ స్నాతకోత్సవనికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరుకానున్నారు. యూనివర్సిటీలో ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి.