News December 11, 2025
విజయనగరంలో బ్రదర్ అనిల్ సందడి

విజయనగరం పాస్టర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురజాడ కళా భారతి ఆడిటోరియంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు బుధవారం రాత్రి విశేషంగా నిర్వహించారు. క్రైస్తవ సోదరులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రముఖ పాస్టర్ బ్రదర్ అనిల్ కార్యక్రమానికి వచ్చి దైవ సందేశాన్ని అందించారు. క్రిస్మస్ అనేది కేవలం వేడుక మాత్రమే కాదని, మనుషుల మధ్య ప్రేమ, సేవ, క్షమ, దయ వంటి విలువలను పంచే పవిత్రమైన సందర్భమని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 9, 2026
100% ఓడీఎఫ్ గ్రామాలుగా ప్రకటించాలి: VZM కలెక్టర్

విజయనగరం జిల్లాలోని అన్ని గ్రామాలను నిర్దేశిత గడువులో 100% ఓడీఎఫ్ గ్రామాలుగా ప్రకటించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓడీఎఫ్ డిక్లరేషన్‌లో వెనుకబడి ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పెండింగ్‌లో ఉన్న వెరిఫికేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. గతంలో నీటి సమస్యలు, వ్యాధులు ఉన్న గ్రామాలపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను శుక్రవారం కోరారు.
News January 9, 2026
VZM: ‘ఉపాధి హామీ పని దినాలు పెరుగుతాయి’

వీబీ జీ రామ్ జీ ద్వారా గ్రామీణ ప్రజలకు విస్తృత ఆర్థిక లబ్ధి చేకూరుతుందని MGNREGS డైరెక్టర్ షణ్ముఖ్ తెలిపారు. స్థానిక ఓ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఈ పథకం అమలుకు విజయనగరం జిల్లాను పైలట్‌గా ఎంపిక చేసినట్లు చెప్పారు. ఉపాధి హామీ పనిదినాలు 100 నుంచి 125కి పెరుగుతాయన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
News January 9, 2026
VZM: ‘పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ త్వరగా పూర్తి చేయాలి’

జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు, తహశీల్దార్లతో శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం సాయంత్రానికి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కనీసం 80% పాసుపుస్తకాల పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.


