News April 20, 2024
ఒలింపిక్స్‌లో మన పట్టు సడలుతోంది!

ఒలింపిక్స్ అనగానే భారత అభిమానులకు వెంటనే గుర్తొచ్చే క్రీడ.. రెజ్లింగ్. అందులోనూ భారత్‌కు పతకాలు తెచ్చిన పురుషుల ఫ్రీస్టైల్ కేటగిరీకి మంచి క్రేజ్ ఉంది. కానీ ఈసారి ఈ కేటగిరీలో ఆటగాళ్లు క్వాలిఫై కావడమే గగనమవుతోంది. 53KG కేటగిరీలో అంతిమ్ పంఘల్ ఒక్కరే అర్హత సాధించారు. 57, 65, 86, 97, 125 కేజీ కేటగిరీల్లో ఇప్పటివరకు ఒక్కరూ క్వాలిఫై కాలేదు. టర్కీలో మే 9-12 మధ్య జరిగే క్వాలిఫైయర్సే భారత్‌కు చివరి అవకాశం.
Similar News
News February 5, 2026
భారత్ ట్యాక్సీ యాప్ ప్రారంభించనున్న అమిత్‌షా

జీరో సర్వీస్ ఛార్జీలతో కేంద్రం తీసుకొచ్చిన భారత్ ట్యాక్సీ సేవలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా యాప్‌ను ప్రారంభించనున్నారు. ముందుగా ఢిల్లీ, గుజరాత్‌లో ఈ విధానం విజయవంతమైతే ముంబై, బెంగళూరు, చెన్నై, HYD వంటి నగరాలకూ విస్తరించనుంది. డ్రైవర్లే వాటాదారులు కాగా 2.5 లక్షల మంది రిజిస్టర్ చేసుకుంటారని అంచనా. ప్రైవేట్ యాప్‌లతో పోలిస్తే 20-30% తక్కువ ధరకు సేవలు అందుబాటులో ఉంటాయి.
News February 5, 2026
పాలు పితికేటప్పుడు ఈ తప్పు చేయొద్దు

కొందరు పాడి రైతులు పశువు నుంచి పాలను సేకరించేటప్పుడు పొదుగు నుంచి పూర్తిగా పాలను తీయకుండా కొన్నింటిని వదిలేస్తారు. ఇలా పొదుగులో మిగిలిపోయిన పాలలోకి బాక్టీరియా చేరి పొదుగువాపు వ్యాధికి కారణమవుతుందని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అలాగే పొదుగుకు అయ్యే చిన్న గాయాలకు చికిత్స అందించకుండా నిర్లక్ష్యం చేస్తే, ఇన్ఫెక్షన్ నెమ్మదిగా పొదుగులోకి వ్యాపించి పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
News February 5, 2026
గులాబీ నేతలకు ‘చపాతీ రోలర్’ గుబులు

TG: మున్సిపల్ ఎన్నికల్లో BRS అభ్యర్థులకు ‘చపాతీ రోలర్’ గుర్తు గుబులు పుట్టిస్తోంది. ADR పార్టీ అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ కేటాయించిన ఆ గుర్తు కారును పోలి ఉందని గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో గుర్తులపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల్లోనూ ఇలాంటి గుర్తుల వల్ల ఓట్ల నష్టం జరిగిందని BRS పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని రద్దు చేయాలని ECని కూడా కోరింది.


