News April 20, 2024

24న జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్

image

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఈనెల 24న నామినేషన్ వేస్తున్నట్లు శుక్రవారం తెలిపారు. కావున జహీరాబాద్, నారాయణఖేడ్, జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

Similar News

News April 10, 2026

ఆధునిక సాంకేతికతను వినియోగించాలి: కలెక్టర్

image

ఆధునిక సాంకేతికతతో పంటల వివిధీకరణ చేపట్టి ఆదాయం పెంచుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ రైతులకు సూచించారు. పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని కోరారు. పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ చర్యలు తీసుకోవాలని, మత్స్య సంపద పెంపుపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పామాయిల్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఉద్యానవన శాఖకు దిశానిర్దేశం చేశారు.

News April 9, 2026

మెదక్: ‘అరైవ్ అలైవ్ వీక్’ను విజయవంతం చేయాలి’

image

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 13 నుంచి నిర్వహించనున్న ‘అరైవ్ అలైవ్ వీక్’ను విజయవంతం చేయాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన ఆయన ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామసభలు, ర్యాలీలు, వాహనదారులకు కంటి పరీక్షలు నిర్వహించి రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పిస్తామని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.

News April 9, 2026

మెదక్: దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

image

హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్స్ టెక్నాలజీ డిప్లొమా కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. HYDలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఈ కోర్సు నిర్వహించబడుతుందన్నారు. 10వ తరగతి అర్హతతో 2026-27 విద్యా సంవత్సరానికి మొదటి ఏడాది డిప్లొమాలో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.