News December 11, 2025
రోహిత్ గొప్ప హృదయానికి అది నిదర్శనం: జైస్వాల్

సౌతాఫ్రికాతో ఇటీవల భారత్ ఆడిన మూడో వన్డేలో యశస్వి జైస్వాల్ తన కెరీర్‌లోనే తొలి సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయితే క్రీజులో కుదురుకునేందుకు ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ తనతో మాట్లాడుతూ భరోసా ఇచ్చినట్లు జైస్వాల్ తెలిపారు. ‘నేను రిస్క్ తీసుకుంటా. నువ్వు ప్రశాంతంగా టైం తీసుకొని ఆడు’ అని తనతో చెప్పినట్లు వివరించారు. ఇది తన గొప్ప హృదయానికి నిదర్శనం అని కొనియాడారు.
Similar News
News January 10, 2026
IPO: రికార్డ్ సృష్టించనున్న రిలయన్స్ జియో

రిలయన్స్ జియో త్వరలో ఐపీఓకు రానున్న <<18729228>>విషయం<<>> తెలిసిందే. తద్వారా రూ.40వేల కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇదే జరిగితే దేశంలో అతిపెద్ద ఐపీఓగా రిలయన్స్ జియో రికార్డ్ సృష్టించనుంది. ప్రస్తుతం ఈ స్థానంలో 2024లో రూ.27,870 కోట్లతో ఐపీఓకు వచ్చిన హ్యుందాయ్ ఉంది. ఆ తర్వాత వరుసగా LIC(21,008Cr), పేటీఎం(18,300Cr), జీఐసీ(రూ.11,176Cr) ఉన్నాయి.
News January 10, 2026
SBIలో 1146 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News January 10, 2026
ఇరాన్‌లో 200మంది మృతి! ట్రంప్ మరో వార్నింగ్

ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనల్లో 200మంది వరకు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారని ఓ వైద్యుడు చెప్పడం కలకలం రేపుతోంది. ఈ సంఖ్య కేవలం టెహ్రాన్‌లోనే అని, దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య మరింత ఉండొచ్చన్నారు. ఈ తరహా వార్తలపై ట్రంప్ ఇరాన్‌కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ‘పౌరులను చంపుతూ ఉంటే US చూస్తూ ఊరుకోదు. ఇరాన్‌కు గట్టిగా బుద్ధి చెబుతుంది’ అని వార్నింగ్ ఇచ్చారు.


