News April 20, 2024
‘సైబర్’ సైన్యాన్ని సిద్ధం చేస్తున్న చైనా!

బలమైన సైన్యం ఇప్పటికే పొరుగు దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న చైనా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మిలిటరీ బలోపేతంలో భాగంగా మరో కొత్త సైన్యాన్ని తయారు చేసేందుకు శ్రీకారం చుట్టింది. అదే సైబర్ సైన్యం. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్‌గా పిలిచే ఈ విభాగానికి యుద్ధాలను గెలిపించే సామర్థ్యం ఉందని డ్రాగన్ భావిస్తోంది. దీనికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Similar News
News March 22, 2026
గ్రీన్ ఎనర్జీలో ఏపీ నంబర్-1: సీఎం చంద్రబాబు

భవిష్యత్తులో అన్ని కంపెనీల డేటా సెంటర్లు భారత్‌కే వస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు జోస్యం చెప్పారు. HYD ISBలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ఏపీకి ఏఐ, క్వాంటం టెక్నాలజీ, డేటా సెంటర్లను తీసుకొచ్చాం. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలకు ప్రాధాన్యం ఇచ్చాం. సోలార్, గ్రీన్, విండ్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రంగంలో దక్షిణాదిలో మేమే నంబర్-1’ అని తెలిపారు.
News March 22, 2026
IPL చరిత్రలోనే తొలిసారి

SRH తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్‌ను నియమించడంతో ఈ ఏడాది IPL ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. 18 సీజన్లలో తొలిసారి ఆరంభ మ్యాచ్‌లకు అన్ని జట్లకూ భారత ఆటగాళ్లే నాయకత్వం వహించనున్నారు. రజత్(RCB), శ్రేయస్(PBKS), పరాగ్(RR), హార్దిక్(MI), రుతురాజ్(CSK), అక్షర్(DC), గిల్(GT), రహానే(KKR), పంత్(LSG) టీమ్స్‌ను లీడ్ చేయనున్నారు. 2019 సీజన్ మధ్యలో ఒకట్రెండు మ్యాచ్‌లకు ఇలా జరిగింది.
News March 22, 2026
యుద్ధం.. కాసేపట్లో ప్రధాని మోదీ కీలక భేటీ

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ కాసేపట్లో సీనియర్ మంత్రులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. పెట్రోలియం, పవర్, ఫెర్టిలైజర్ మంత్రులు పాల్గొననున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా నిరంతరాయంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఎరువుల సరఫరా, సరకు రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడటమే మీటింగ్ ఉద్దేశమని తెలిపాయి. అలాగే ఇటీవల ఇరాన్ ప్రెసిడెంట్‌తో మాట్లాడిన అంశాలపైనా మోదీ చర్చించే అవకాశం ఉంది.


