News December 11, 2025

చలికాలం.. పాడి పశువుల సంరక్షణ(2/2)

image

ఇప్పటి వరకు పశువులకు గాలికుంటు, గొంతువాపు, చిటుక వ్యాధుల టీకాలు వేయించకపోతే వెటర్నరీ డాక్టర్ సూచన మేరకు టీకాలు వేయించాలి. బాహ్య పరాన్న జీవుల నుంచి పశువులను, జీవాలను కాపాడటానికి పాకలను, షెడ్లను శుభ్రంగా ఉంచాలి. పశువుల విసర్జితాలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. షెడ్లలో నిమ్మ గడ్డి, తులసి, వావిలాకు కొమ్మలను కట్టలుగా కట్టి వేలాడదీస్తే వీటి నుంచి వచ్చే వాసనకు బాహ్యపరాన్న జీవులు షెడ్లలోకి రాకుండా ఉంటాయి.

Similar News

News January 3, 2026

చుక్క నీటిని వదులుకోం: ఉత్తమ్ కుమార్

image

TG: కృష్ణాజలాల్లో చుక్క నీటిని కూడా వదులుకోబోమని అసెంబ్లీలో PPT సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 99శాతం చేశామన్న కేసీఆర్ వ్యాఖ్యలు అబద్ధమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాకే ప్రాజెక్టు పనులు పునరుద్ధరించినట్లు చెప్పారు.

News January 3, 2026

వెనిజులా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్నాం: ట్రంప్

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వెనిజులాలో భారీ పేలుళ్లకు పాల్పడింది మేమే. <<18750335>>ప్రెసిడెంట్ <<>>నికోలస్ మధురో, ఆయన భార్య ఇప్పుడు మా అదుపులో ఉన్నారు. US లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈ లార్జ్ స్కేల్ ఆపరేషన్ చేపట్టింది. ఈ అంశంపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నాం. ఇంటర్నేషనల్ డ్రగ్స్‌ కేంద్రంగా వెనిజులా మారింది’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

News January 3, 2026

ECGతో గుండెపోటును ముందే గుర్తించలేం: వైద్యులు

image

ఈసీజీ రిపోర్ట్ నార్మల్‌గా ఉన్నంత మాత్రాన గుండెపోటు ముప్పు లేదని నిర్ధారించలేమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ECG కేవలం ఆ క్షణంలో గుండె స్థితిని మాత్రమే చూపిస్తుంది. గుండెపోటుకు కొన్ని గంటల ముందు తీసిన ECG కూడా చాలా మందిలో నార్మల్‌గా వచ్చే అవకాశం ఉంది. రక్తనాళాల్లో పూడికలు(Plaque) ఎప్పుడు పగిలి గుండెపోటు వస్తుందో ముందే ఊహించలేదు. నిర్లక్ష్యం చేయకుండా ఇతర పరీక్షలు చేయించుకోవాలి’ అని సూచిస్తున్నారు.