News April 20, 2024
MLAగా రఘురామకృష్ణరాజు పోటీ.. ఎక్కడి నుంచంటే?

AP: టీడీపీ నేత రఘురామకృష్ణరాజుకు ఎట్టకేలకు అసెంబ్లీ సీటు ఖరారైంది. ప.గో. జిల్లా ‘ఉండి’ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని టీడీపీ హైకమాండ్ తనను ఆదేశించిందని రఘురామ తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తానని చెప్పారు. పార్టీ నుంచి బీఫాం అందుకుని ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేస్తానని ప్రకటించారు.
Similar News
News March 13, 2026
మాజీ DGP HJ దొర కన్నుమూత

ఉమ్మడి ఏపీ డీజీపీ HJ దొర కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. 1943లో శ్రీకాకుళంలో జన్మించిన దొర.. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేశారు. 1965 బ్యాచ్‌కు చెందిన IPS అధికారి. కేంద్రంలో విజిలెన్స్ అధికారిగా, CISFకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పనిచేశారు. పదవిలో ఉండగా.. ఆయన్ని చంపేస్తామని మావోయిస్టులు అప్పట్లో బెదిరించారు.
News March 13, 2026
AP క్యాబినెట్ నిర్ణయాలు

*మిషన్ శక్తి కింద ‘సఖీ నివాస్’ పేరుతో వర్కింగ్ ఉమెన్స్‌కు హాస్టళ్లు
*అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు.
*సచివాలయం, HOD టవర్ల పనులకు గ్రీన్ సిగ్నల్. మెకానికల్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనుల కోసం ₹2,316 కోట్లకు అనుమతులు.
*FRA పట్టాదారులకు రాయితీలు ఇవ్వాలని నిర్ణయం
*పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌లో పనులకు ₹23.47 కోట్లు, ప్యాకేజీ-64A పనులకు ₹24.51 కోట్లు.
News March 13, 2026
ఈ ఏడాదే అనుష్క పెళ్లి..?

టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి(44) ఈ ఏడాది వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యాపారవేత్తతో ఆమె పెళ్లి నిశ్చయమైనట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల అంగీకారంతోనే ఈ సంబంధం ఖరారైందని సమాచారం. గతంలో అనేక రూమర్లు వచ్చినప్పటికీ, ఈసారి మాత్రం పెళ్లి పక్కా అని టాక్ వినిపిస్తోంది. దీనిపై అనుష్క టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


