News April 20, 2024
HYDలో ఆదివారం మటన్ షాపులు బంద్

ఏప్రిల్ 21న (ఆదివారం) మహవీర్ జయంతి వేడుకలు నిర్వహించేందుకు జైనులు సిద్ధమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వీరి సంఖ్య ఎక్కువే ఉండడంతో ఆ రోజు భారీ ర్యాలీలు తీయనున్నారు. ఈ నేపథ్యంలోనే GHMC పరిధిలో మాంసం దుకాణాలు (మటన్, పశువుల కబేళాలు, బీఫ్ షాపులు) మూసివేయనున్నారు. ఇందుకు సంబంధించి బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. SHARE IT
Similar News
News January 14, 2026
HYD: భూగర్భజలాలు పాతాళానికి

భారీ వర్షాలు కురిసినా బల్దియాలోని భూగర్భజలాలు పడిపోతున్నాయి. నిరుడితో పోలిస్తే నీటిమట్టం 2-3 అడుగుల దిగువకు జారిందని అధికార గణాంకాలు చెబుతున్నాయి. GHMC పరిధిలోని 46 మండలాల్లో 13 మండలాలు రెడ్‌జోన్‌లోకి వెళ్లాయి. కాంక్రీటీకరణతో వర్షపు నీరు భూమిలోకి ఇంకకపోవడం ప్రధాన కారణం. బోర్లు అడుగంటడంతో వేసవిలో నగర, శివారువాసులకు నీటి ఎద్దడి తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకుడు గుంతల ఆవశ్యకత గుర్తుచేస్తున్నాయి.
News January 14, 2026
మెట్రో మార్కు చిత్రకళ.. ‘పరిచయ్’ అదిరింది బాసూ!

మెట్రో రైలును పట్టాలెక్కించినట్టే చిత్రకారుల ప్రతిభను ప్రపంచానికి చాటాలంటున్నారు NVS రెడ్డి. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘పరిచయ్ ఆర్ట్ ఫౌండేషన్’ నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్, క్యాంప్ కళాభిమానులను ఫిదా చేస్తోంది. ఒకేచోట ప్రదర్శన, ప్రత్యక్ష చిత్రలేఖనం చూడటం అరుదైన అవకాశమని చెప్పుకొచ్చారు. జయవంత్ నాయుడు ఆధ్వర్యంలో 12 మంది దిగ్గజ చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన అద్భుతాలు ఇక్కడ కొలువుదీరాయి.
News January 14, 2026
పతంగ్: Made In Dhoolpet

పతంగ్.. పండుగ 3 రోజులే కానీ, 365 రోజులు ధూల్‌పేటలో గాలిపటాల తయారీ ఉంటుందని మీకు తెలుసా?. అవును.. స్టేట్ వైడ్ వ్యాపారులు, నగరవాసులు అధికంగా ఇక్కడికే వస్తుంటారు. దీంతో లక్షల్లో పతంగులు సిద్ధం చేయాలి. హ్యాండ్‌మేడ్ కదా.. 5 రోజులకు ఒక్కరు 100 పేపర్ పతంగుల వరకు తయారీ చేయగలరు. అందుకే ఏడాది మొత్తం శ్రమించి 500 రకాల విభిన్న రూపాల్లో లక్షల్లో పతంగులు రెడీ చేస్తారు. పైఫొటోలో ఉన్న పతంగ్ Made In Dhoolpet.


