News December 11, 2025
శ్రీకాకుళం: జైల్లో పరిచయం.. బయటకొచ్చి దొంగతనాలు

బూర్జలో చోరీలకు పాల్పడిన ఐదుగురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విశాఖ, కోనసీమ, బిహార్‌కు చెందిన నాగరాజు, ఆనంద్, శ్రీను, చంటిబాబు, శుభం మిశ్రా పాత కేసుల్లో జైలుకెళ్లారు. బయటొచ్చాక గాజువాకలో స్థిరపడ్డారు. శ్రీను అత్తగారి ఊరు శ్రీకాకుళం జిల్లా బూర్జ. ఆ గ్రామానికి చెందిన రమేశ్ ఇంటికి తాళం వేసి ఉండటాన్ని శ్రీను గమనించాడు. ఈ నెల 1న అందరూ కలిసి దొంగతనం చేసినట్లు DSP వివేకానంద తెలిపారు.
Similar News
News January 21, 2026
కాశీబుగ్గ ఆలయంలో భారీ చోరీ.. ఎక్కడి వాళ్లు చేశారంటే!

కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఇటీవల జరిగిన చోరీ ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కే.వీ మహేశ్వర రెడ్డి వివరాలు వెల్లడించారు. ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి చోరీకి గురైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎల్.ఎన్.పేట మండలానికి చెందిన వారిగా గుర్తించారు.
News January 21, 2026
SKLM: రెండో రోజు హెలికాఫ్టర్ రైడ్‌లో ఎంత మంది విహరించారంటే?

రథసప్తమి ఉత్సవాలు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన హెలికాఫ్టర్ రైడ్‌ను శ్రీకాకుళం వాసులు ఆస్వాదిస్తున్నారు. మంగళవారం రెండో రోజు దాదాపు 174 మంది హెలికాఫ్టర్‌లో విహరించగా రూ.3,82,400 వసూలయ్యాయి. రైడర్లకు ప్రత్యేకంగా స్వామి వారి చిన్న విగ్రహం, ప్రసాదాన్ని అందజేస్తున్నారు. డచ్ బంగ్లా వద్ద ప్రత్యేకంగా బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. రూ.2,200 చెల్లించి టికెట్ తీసుకోవాలి.
News January 21, 2026
రాజాం పోలిపల్లి అమ్మవారి జాతర.. షెడ్యూల్ ఇదే

రాజాం పోలిపల్లి అమ్మవారి జాతర ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది.
➱ఫిబ్రవరి 20న (శుక్రవారం) అమ్మవారి నేత్రోత్సవం
➱22న (ఆదివారం) జాతర ప్రారంభం
➱23న (సోమవారం) పసుపు, కుంకుమ, ముర్రాటలతో మొక్కులు చెల్లిస్తారు
➱24న (మంగళవారం) రాత్రి గుడిలోకి ఘటాలు రావడంతో జాతర ముగుస్తుంది.
చివరి రోజున వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ కమిటీ అన్నీ ఏర్పాట్లు చేస్తోంది.


