News April 20, 2024

విశాఖ: జగన్ బస్సుయాత్ర షెడ్యూల్ ఇదే

image

సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్‌ని వైసీపీ నేతలు విడుదల చేశారు. ఈరోజు ఉ.9 గంటలకు గొడిచర్ల రాత్రి బస నుంచి బయలుదేరి నక్కపల్లి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నరసింగపల్లి మీదుగా సా.3:30 గంటలకు చింతపాలెం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా చిన్నయపాలెం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

Similar News

News March 12, 2026

విశాఖలో మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్

image

విశాఖ టీడీపీ కార్యాలయంలో మంత్రి లోకేశ్ గురువారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని విధాల అండగా ఉంటామని ప్రజలకు మంత్రి భరోసా ఇచ్చారు. అయితే విశాఖలో క్యాప్ జెమిని ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ నేడు భేటీ కానున్నారు.

News March 12, 2026

గతం ఘనం.. AUలో పరిశోధకులకు కష్టకాలం

image

AUలో PHD చేస్తున్న పరిశోధక విద్యార్థులు తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. సరైన స్టైఫండ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. UGC మార్గదర్శకాల ప్రకారం అనేక జాతీయ విశ్వవిద్యాలయాల్లో ప్రతినెలా స్టైఫండ్ అందుతోంది. కేరళ, తమిళనాడులో నెలకు రూ.15 వేల వరకు ఇస్తున్నారు. అయితే AUలో మాత్రం తగిన మద్దతు లేకపోవడంతో పరిశోధనపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నామని విద్యార్థులు చెబుతున్నారు.

News March 12, 2026

పౌర సమస్యల పరిష్కారానికి ‘వైజాగ్-1’ మొబైల్ యాప్

image

విశాఖలో పౌర సమస్యల పరిష్కారానికి ‘వైజాగ్-1’ మొబైల్ యాప్‌ను రూపొందించామని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. బుధవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన వివరించారు. వార్డు, సచివాలయ డేటాను విశ్లేషించి సమస్యలకు శాశ్వత పరిష్కారం అందిస్తామని అన్నారు. ఏఐ చాట్‌బాట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసి సర్వీస్ నంబర్ ఇస్తామన్నారు. దీంతో కలెక్టర్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు.