News December 11, 2025
కృష్ణా: మామూళ్ల మత్తే కారణమా..?

భారీ లోడుతో, ఫిట్‌నెస్ లేని వాహనాల కారణంగా ఈ ఏడాది ఉమ్మడి కృష్ణాలో 1500కు పైగా ప్రమాదాలు జరిగాయి. వీటిని తనిఖీ చేసి సీజ్ చేయాల్సిన రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు సేఫ్టీ అధికారులు మామూళ్ల మత్తులో ఉండి వాహనాలను పట్టీపట్టనట్లు వదలడంతోనే అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 11, 2026
జీవీఎంసీ బడ్జెట్ రెడీ… రేపు స్థాయి సంఘంలో చర్చ!

జీవీఎంసీ బడ్జెట్ తుదిమెరుగులు దిద్దారు. కమిషనర్ కేతన్గర్, మేయర్ శ్రీనివాసరావు కలిసి బడ్జెట్ రూపకల్పన చేయగా 13 పద్దుల కింద రూ.2064.73 కోట్లు ఆదాయం అని అంచనా వేశారు. జీవీఎంసీకి సొంతంగా అన్ని విభాగాల నుంచి 1749.68 కోట్లు సమకూర్తున్నట్లు బడ్జెట్‌లో చూపించారు. బడ్జెట్‌లో ప్రస్తావించిన వివిధ అంశాలను సోమవారం జరిగే స్థాయి స్థానం సమావేశంలో సభ్యులతో సలహాలు తీసుకొని తుది మార్పులు చేసి ఆమోదం తెలపనున్నారు.
News January 11, 2026
జనగామ: అధికారుల తప్పిదం.. అర్హులకు అన్యాయం!

ప్రజాపాలన దరఖాస్తుల నమోదులో అధికారుల నిర్వాకం వల్ల అర్హులకు అన్యాయం జరుగుతోంది. ఇటీవల రేషన్ కార్డులు పొందిన వారు గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు దరఖాస్తు చేసుకునే క్రమంలో రేషన్ కార్డుతో వేరొకరు లబ్ధిపొందుతున్నట్లు ఆన్లైన్లో చూపిస్తుండడంతో, అసలైన అర్హులు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రఘునాథపల్లి పరిధిలో ఓ మహిళ గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునే క్రమంలో అసలు విషయం తెలిసింది.
News January 11, 2026
మేడారం: టూర్లతో పనులకు బ్రేకులు!

అసలే మేడారం జాతరకు టైమ్ లేదు. మరోపక్క ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పటికే 7 సార్లు వచ్చిన మంత్రి పొంగులేటి, ఆదివారం మరోసారి వస్తున్నారు. ఆయనతో పాటుగా నలుగురు మంత్రులు వస్తుండటంతో జాతర పనులకు ఆటంకం ఏర్పడుతుందని కార్మికులు వాపోతున్నారు. అసలే సమయం లేకపోగా, మంత్రుల వరుస పర్యటనతో 3 నుంచి 4 గంటల పాటు పనులు నిలిచిపోతున్నాయి. మరోపక్క భక్తులు సైతం పోటెత్తుండటంతో ఈ పనులు కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.


