News December 11, 2025
ఓటర్లు ఉత్సాహంగా తరలివస్తున్నారు: ఎస్పీ శబరీష్

గూడూరు మండలంలోని 41 గ్రామ పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ శబరీష్ మండల కేంద్రంలోని ఓటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ స్పష్టం చేశారు.
Similar News
News January 14, 2026
NRPT: సంక్రాంతి పండగ పూట విషాదం..

నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని గుడెబల్లూర్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన నేతాజీ (36) దుర్మరణం చెందారు. మక్తల్ నుంచి రాయచూర్ వెళ్తున్న లారీ, అదే మార్గంలో వెళ్తున్న బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నేతాజీ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఎస్సై నవీద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పండుగ పూట ఈ ప్రమాదం విషాదం నింపింది.
News January 14, 2026
KNR: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల కొరత

కరీంనగర్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల కొరత రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు శాపంగా మారింది. రెగ్యులర్ అధికారులు లేక జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఇన్‌ఛార్జులుగా కొనసాగుతున్నారు. తిమ్మాపూర్ వంటి చోట్ల 3 నెలల్లోనే నలుగురు అధికారులు మారడం గమనార్హం. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జాప్యం జరుగుతోందని, తగిన అవగాహన లేక దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని క్రయవిక్రయదారులు వాపోతున్నారు.
News January 14, 2026
క్యాబినెట్ అజెండాలోకి ‘నల్లమలసాగర్’

TG: నల్లమలసాగర్ ప్రాజెక్టుపై క్యాబినెట్ సమావేశంలో చర్చించి ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 18న మేడారంలో జరిగే క్యాబినెట్ అజెండాలో ఈ అంశాన్ని చేర్చింది. నల్లమలసాగర్‌పై APని కట్టడిచేసేలా న్యాయపరమైన అంశాలన్నిటినీ దీనిలో చర్చించనుంది. ఇటీవల వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని SC చెప్పడంతో TG ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. దీంతో సివిల్ దావాను పగడ్బందీగా దాఖలు చేసేందుకు నిర్ణయించింది.


