News April 20, 2024

మెదక్: తప్పుడు పత్రాలతో ఫ్లాట్ రిజిస్ట్రేషన్.. మరో ఇద్దరు అరెస్టు

image

మనోహరాబాద్ మండలం కూచారం శివారులో తప్పుడు ధ్రువపత్రాలతో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసిన కూకట్‌పల్లికి చెందిన వీరపనేని మధుసూదన్ రావు(50), హైదరాబాద్ కు చెందిన వెంకటేశ్వర్లు(48)ను అరెస్టు చేసినట్లు ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 13న సత్యనారాయణమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. ఈనెల 7న ఇదే కేసులో కందవల్లి రాజేష్(34)ను అరెస్టు చేసినట్లు ఎస్సై చెప్పారు.

Similar News

News March 25, 2026

నర్సాపూర్: స్వయంభూగా కొలువైన సీతారామసమేత ఆలయం

image

స్వయంభు ఏకాంతంగా వెలిసిన సీతారామ స్వామి ఆలయంగా పేరు పొందుతున్న నర్సాపూర్ పట్టణ సమీపంలోని సీతారాంపూర్లో ప్రతిఏటా శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు పూజారి హరిప్రసాద్ శర్మ తెలిపారు. 600 ఏళ్ల క్రితం కాకతీయులు ఆలయం నిర్మించినట్లు తెలిపారు. శ్రీ సీతారామసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 రోజులపాటు ఉత్సవాల గురించి ఆయన వే2న్యూస్‌తో తెలిపారు. ఉదయగిరి చుట్టూ బండ్ల ప్రదక్షిణలు నిర్వహిస్తారన్నారు.

News March 24, 2026

మెదక్: ‘జనగణన పక్కాగా నిర్వహించాలి’

image

జనగణన-2027 మొదటి విడతలో భాగంగా ఇండ్ల గణన విధులను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మండల ప్రణాళిక అధికారులు, సాంకేతిక సహాయకులకు జనగణన ప్రక్రియ, మొబైల్ యాప్ నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. వివరాల సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని, ఏప్రిల్‌లో సన్నాహక పనులు చేపడతామన్నారు.

News March 24, 2026

సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం: కలెక్టర్ ప్రతిమా సింగ్

image

వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. 917 హ్యాబిటేషన్లలో 1.76 లక్షల కుటుంబాలకు నిరంతర నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 1485 ట్యాంకుల శుభ్రత, బోర్లు, పైపుల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా పర్యవేక్షణతో పాటు అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని తెలిపారు.