News April 20, 2024

ఐదేళ్లలో పెరిగిన రోజా ఆస్తులు

image

గత ఐదేళ్లలో మంత్రి రోజా ఆస్తులు పెరిగాయి. 2019లో ఆమె చరాస్థులు రూ.2.74 కోట్లు కాగా ఇప్పుడు రూ.4.58 కోట్లయ్యాయి. స్థిరాస్తులు రూ.4.64కోట్లు ఉండగా రూ.6.05 కోట్లకు చేరాయి. 2019లో ఆరు కార్లు, ఓ బైకు ఉండగా.. ఇప్పుడు 9 కార్లు ఉన్నాయి. నగరి నియోజకవర్గంలో భర్త పేరుపై 6.39 ఎకరాలు కొన్నారు. కేసులు లేవు, ఆమె దగ్గర 986 గ్రాములు, భర్త దగ్గర 485 గ్రాముల బంగారం ఉంది. అప్పులు రూ.1.66 కోట్లుగా అఫిడవిట్‌లో చూపారు.

Similar News

News March 15, 2026

కాణిపాకం: 17న అత్యవసర ధర్మకర్తల మండలి సమావేశం

image

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 17న ఉదయం 10:30 గంటలకు అత్యవసర ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి పెంచల కిశోర్ తెలిపారు. యుద్ధ పరిస్థితులు, అవసరమైన సరుకుల సరఫరా, ప్రసాదానికి ఉపయోగించే గ్యాస్ సరఫరా సంబంధిత ఏర్పాట్లపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశానికి ధర్మకర్తల మండలి ఛైర్మెన్, సభ్యులు, అధికారులు హాజరుకావాలని వారు కోరారు.

News March 15, 2026

చిత్తూరు: పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

image

జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు ఆదివారం తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. వారికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరిసర ప్రాంతాలలో ఎవరు గుంపులు గుంపులుగా రాదని, జెరాక్స్ సెంటర్లు తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు.

News March 15, 2026

చిత్తూరు: ‘గ్యాస్ కష్టాలు ఉంటే కాల్ చేయండి’

image

జిల్లాలో వంట గ్యాస్ సరఫరా సజావుగా సాగుతోందని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని JC ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. గ్యాస్ సరఫరాపై వినియోగదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్యాస్ సరఫరాకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు, సందేహాలు ఉంటే (ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) 08572-242734 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.