News December 11, 2025
కరీంనగర్: 11 గంటల వరకు 46.39% పోలింగ్ నమోదు

కరీంనగర్ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 46.39% పోలింగ్ నమోదైంది. చొప్పదండిలో అత్యధికంగా 53.98% పోలింగ్ జరగ్గా, కరీంనగర్ రూరల్‌లో 49.64%, గంగాధరలో 45.16%, కొత్తపల్లిలో 46.19%, రామడుగులో 40.83% చొప్పున ఓటింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలలో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.
Similar News
News January 20, 2026
KNR: ‘విశ్రాంత ఉద్యోగులకు జీపీఎఫ్ డబ్బులు చెల్లించాలి’

విశ్రాంత ఉద్యోగులకు జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ త్వరితగతిన చెల్లించాలని ఎస్టీయూ నాయకులు జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజును కోరారు. ఈమేరకు సోమవారం ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కోట శ్యామ్‌కుమార్ డీటీఓను కలిసి విన్నవించారు. అలాగే కులగణన సర్వేలో పాల్గొన్న సిబ్బంది డబ్బులు కూడా సకాలంలో చెల్లించాలని వారు కోరారు.
News January 19, 2026
కరీంనగర్: ‘కార్టూన్.. సమాజాన్ని ప్రశ్నించే అస్త్రం’

సమాజంలోని రుగ్మతలను ప్రశ్నించడానికి కార్టూన్ ఒక శక్తివంతమైన మాధ్యమమని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. సోమవారం ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెండు రోజుల వ్యంగ్య చిత్ర కళా శిక్షణను ఆమె ప్రారంభించారు. వేగవంతమైన ఈ ప్రపంచంలో తక్కువ సమయంలోనే లోతైన ప్రభావం చూపే శక్తి కార్టూన్లకు ఉందని, విద్యార్థులు ఈ కళను నేర్చుకోవాలని కలెక్టర్ సూచించారు.
News January 19, 2026
చల్లూరులోనే ఇసుక తవ్వకాలు.. నివేదిక సమర్పించిన కమిటీ

వీణవంక మండలం చల్లూరులో అనుమతి పొంది, ఇప్పలపల్లి గ్రామ పరిధిలో ఇసుక తవ్వుతున్నారన్న ఆరోపణలు వాస్తవం కాదని విచారణ కమిటీ తేల్చింది. కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలతో ఏడుగురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. డీజీపీఎస్ సర్వే ప్రకారం చల్లూరు పరిధిలోనే మైనింగ్ జరిగిందని, ఇప్పలపల్లిలో అక్రమ తవ్వకాలు జరగలేదని నిర్ధారించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బావులను తొలగించారని, నిబంధనలు పాటించాలన్నారు.


