News December 11, 2025

విజేత కడప జట్టు

image

పులివెందుల పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంటులో కడప జట్టు విజేతగా నిలిచింది. గురువారం కడప, విశాఖపట్నం జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కడప జట్టు గెలుపొందింది. రెండో స్థానంలో విశాఖ, తృతీయ స్థానంలో పశ్చిమగోదావరి జిల్లా జట్టు నిలిచింది. ఆయా జట్ల విజేతలకు MLC రాంగోపాల్ రెడ్డి బహుమతులను అందజేశారు.

Similar News

News March 4, 2026

మైదుకూరు: నోటికాడి ఆహారాన్ని కూడా వదలరా.?

image

కడప జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిన్న రాత్రి మైదుకూరులో దాడులు చేసి పీడీఎస్‌కు చెందిన 57 బస్తాల బియ్యం, 91 బస్తాల జొన్నలు, 6 బస్తాల రాగులు పట్టుకున్నారు. ప్రభుత్వ రేషన్ దుకాణాలు, పాఠశాలల మధ్యాహ్న భోజనం, అంగన్వాడీలు, సంక్షేమ హాస్టళ్ల ముద్ర కలిగిన గన్నీ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. చివరికి అక్రమార్కులు బడి పిల్లలు, పసి పిల్లల అన్నాన్ని సైతం వదలకుండా అమ్ముకుంటున్నారు.

News March 4, 2026

ప్రొద్దుటూరు: జగన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ASP

image

మాజీ సీఎం YS జగన్ ఈనెల 5న ప్రొద్దుటూరుకు రానున్న విషయం తెలిసిందే. ప్రొటోకాల్ ప్రకారం YS జగన్ పర్యటన బందోబస్తు, హెలిప్యాడ్ ఏర్పాట్లను మంగళవారం ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ పరిశీలించారు. 1-టౌన్ సీఐ కొండారెడ్డి, రూరల్ సీఐ నాగభూషణ్‌తో కలిసి ASP తనిఖీ చేశారు. నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు. ప్రొద్దుటూరు మాజీ MLA రాచమల్లు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ప్రొద్దుటూరుకు YS జగన్ వస్తున్నారు.

News March 3, 2026

కడప జిల్లా పురపాలక పాలకవర్గాలకు కౌంట్ డౌన్.!

image

కడప: జిల్లాలో పురపాలక పాలకవర్గాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. వీటి పదవీకాలం ఈనెల 17 నాటికి ముగియనుంది. 18వ తేదీ నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. జిల్లాలో కడప కార్పొరేషన్, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు మున్సిపాలిటీలతో పాటు జిల్లాలోని మిగతా మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం రెండు వారాల్లో ముగియనుంది. గత ఎన్నికల్లో వీటి అన్నింటినీ వైసీపీ గెలుచుకుంది.