News December 11, 2025

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరో నోటిఫికేషన్ విడుదల

image

<>భారత్<<>> ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, నవీ ముంబై 4 డిప్యూటీ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్) అర్హతగల వారు డిసెంబర్ 31వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.472. జీతం నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000వరకు చెల్లిస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

Similar News

News March 10, 2026

తమిళనాడులో NDAకు ఎంట్రీ లేదు: స్టాలిన్

image

బీజేపీ ఆధ్వర్యంలోని NDAకు తమిళనాడులో ఎంట్రీ లేదని సీఎం స్టాలిన్ అన్నారు. ‘TNకు ఏమీ ఇవ్వకూడదనుకునే వారికి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారు? అయినా ఓట్లు అడిగేందుకు వాళ్లెలా వస్తారు? ఈ ఎన్నికలు తమిళనాడు-NDA మధ్య, DMK టీమ్‌కు-ఢిల్లీ టీమ్‌కు మధ్యే జరుగుతున్నాయి. AIADMKను మింగేయాలని బీజేపీ చూస్తోంది. ఆ పార్టీని చూస్తే జాలి కలుగుతోంది. బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారు’ అని విమర్శించారు.

News March 10, 2026

రాత్రి మంచి నిద్ర కోసం..

image

రాత్రి వేళ చక్కటి నిద్ర కోసం ఆహారంలో అరటిపండు, పిస్తా, బార్లీ, పాలు, పెరుగు, గుడ్డు తెల్లసొన, గుమ్మడి విత్తనాలు భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటిలోని ట్రిప్టోఫాన్ నిద్రలో కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇక కొంతమంది రాత్రి మద్యం తాగితే మంచి నిద్ర పడుతుందని భావిస్తారని, ఇందులో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. దానివల్ల నిద్రకు భంగం కలుగుతుందన్నారు.
Share It

News March 10, 2026

యుద్ధం సెగ.. పాక్ కఠిన నిర్ణయాలు

image

ఇరాన్ యుద్ధం సెగ పాక్‌కు గట్టిగానే తగులుతోంది. ఇంధన కొరతను నివారించేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ వాహనాల ఇంధన కోటాలో 50% కోత విధించింది. 60% వాహనాలను నడపొద్దని నిర్ణయించింది. మంత్రులు, ఎంపీల జీతాల్లో కోత పెట్టింది. ఆఫీసులను వారానికి 4 రోజులు మాత్రమే తెరవనుంది. స్కూళ్లకు 15 రోజులు సెలవులిచ్చింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాలని సూచించింది.