News April 20, 2024

జహీరాబాద్ లోక్‌సభ స్థానంపై సీఎం ప్రత్యేక దృష్టి!

image

జహీరాబాద్ లోక్‌సభ స్థానంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చర్చ నడుస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి, జుక్కల్, ఆందోల్, నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందడంలో దృష్టి పెడితే గెలుపు ఖాతాలో వేసుకోవచ్చని సీఎం కాంగ్రెస్ నాయకుల సమావేశంలో అన్నట్లు తెలిసింది. దీనిలో భాగంగా ఈనెల 24న జహీరాబాద్ కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం.

Similar News

News March 24, 2026

మెదక్: పెండింగ్ కేసులు త్వరగా పూర్తి చేయాలి: ఎస్పీ

image

మెదక్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. పెండింగ్ కేసులను నిష్పక్షపాతంగా, వేగంగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రాంగ్‌రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాత్రి పెట్రోలింగ్ పెంచాలని సూచించారు. డయల్ 100 కాల్స్‌కు తక్షణమే స్పందించి బాధితులకు భరోసా కల్పించాలని ఆదేశించారు.

News March 24, 2026

రాష్ట్రపతి నిలయంలో పోటీలు.. మెదక్ విద్యార్థుల ప్రతిభ!

image

హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రెండు బహుమతులు సాధించినట్లు ఇన్చార్జి ప్రిన్సిపల్ సింహారెడ్డి తెలిపారు. ఉపన్యాస పోటీలో పూనం రాజ్ పురోహిత్ తృతీయ బహుమతి సాధించగా, నినాదాల(స్లోగన్స్) పోటీలో అభినయ్ ప్రత్యేక బహుమతి అందుకున్నారు. విజేతలను కళాశాల అధ్యాపక బృందం, తోటి విద్యార్థులు అభినందించారు.

News March 24, 2026

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు: కలెక్టర్ ప్రతిమా సింగ్

image

భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో తహశీల్దార్లు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్‌లో గూగుల్ మీట్ ద్వారా భూభారతి, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు, ఓటర్ జాబితా తయారీపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలాల వారీగా అన్ని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలన్నారు.