News April 20, 2024
అనంత: 21న నీట్, ఐఐటీ అకాడమీల్లో ప్రవేశ పరీక్ష

సాంఘిక సంక్షేమ అంబేడ్కర్
గురుకులాల ప్రవేశ పరీక్షలో ప్రతిభను కనబరిచిన విద్యార్థులు రెండో విడతలో నీట్, ఐఐటీ అకాడమీల్లో ప్రవేశానికి ఈనెల 21న నిర్వహించనున్న పరీక్షకు హాజరు కావాలని ఉమ్మడి జిల్లా గురుకుల విద్యాలయాల సమన్వయకర్త ఎ.మురళీకృష్ణ తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రానికి గుర్తింపు కార్డు లేదా ఆధార్‌తో హాజరు కావాలన్నారు. ఉదయం 10 నుంచి పరీక్ష కురుగుంట గురుకులంలో జరుగుతుందన్నారు.
Similar News
News March 11, 2026
అనంత: ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన M.Tech 1-1 (R25) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్‌తో కలిసి ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు కళాశాలలోని అకడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.
News March 11, 2026
అనంత: ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన M.Tech 1-1 (R25) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్‌తో కలిసి ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.
News March 11, 2026
అనంత: ఈ రోజు నుంచి ఉచితం

గర్భాశయ కాన్సర్‌ను నిర్మూలించేందుకు తగు చర్యలు చేపట్టినట్లు DMHO దేవి తెలిపారు. అనంతపురంలో ఆమె మాట్లాడుతూ.. గర్భాశయ ముఖ క్యాన్సర్ నిర్మూలనకు బాలికలకు ముందస్తుగా HPV టీకాలు బుధవారం నుంచి వేస్తామన్నారు. జిల్లాలో 14 నుంచి 15 ఏళ్ల మధ్య బాలికలు 16,449 మంది ఉన్నారన్నారు. వారికి సరిపడా డోసులు ముందస్తుగానే జిల్లాకు చేరాయన్నారు. ఒక్కో డోసు ఖరీదు రూ.3,989 కాగా వాటిని ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందన్నారు.


