News April 20, 2024
ఆదిలాబాద్: బంగారం లేని ఎంపీ అభ్యర్థి

ADB కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున MLA వెడ్మబొజ్జు నామినేషన్ దాఖలు చేశారు. అయితే అఫిడవిట్‌లో తనకు బంగారు ఆభరణాలు ఏమి లేవని, తనపై 50 క్రిమినల్ కేసులు ఆయా పోలీస్ స్టేషన్లలో పెండింగులో ఉన్నట్లు సుగుణ వెల్లడించారు. 2023-24లో తన పేరిట రూ. 5,64,170 ఆదాయం ఉందని చూపించగా..భర్త పేర రూ. 19,08,010 ఉన్నట్లుగా నివేదికలో ప్రస్తావించారు. చరాస్తులు రూ. 12,10,000, స్థిరాస్తులు రూ. 42,50,000 చూపించారు.
Similar News
News July 10, 2025
రుయ్యాడి పీర్ల బంగ్లా ఆదాయం ఎంతంటే..?

తలమడుగు మండలం రుయ్యాడి హస్సేన్, హుస్సేన్ దేవస్థానంలో సవార్లకు భక్తులు సమర్పించిన కానుకలు, హుండీ లెక్కింపును బుధవారం చేపట్టారు. దేవస్థాన కమిటీ, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో లెక్కింపు కొనసాగింది. నగదు రూపంలో రూ.14 లక్షలు,10 తులాల బంగారం, 1.25 కేజీల వెండి వచ్చినట్లు దేవస్థాన కమిటీ తెలిపింది.
News July 10, 2025
ADB: నకిలీ పత్రాలతో భూ మాఫియా.. ముఠా అరెస్టు

నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్‌ల అమ్మకం పేరుతో రూ.23 లక్షలు మోసం చేసిన ఘటనలో ఆరుగురిపై ADB రూరల్ PSలో కేసు నమోదైంది. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు DSP జీవన్‌రెడ్డి తెలిపారు. గుగులోత్ బాపురావు(ప్రభుత్వ ఉపాధ్యాయుడు), అతడి భార్య అంబికా, దాసరి జ్యోతి, గొడ్డెంల శ్రీనివాస్, పాలెపు శ్రీనివాస్, మాల్లేపల్లి భూమన్నతో కలిసి, నకిలీ పత్రాలు సృష్టించి భూ మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
News July 10, 2025
ADB: నేడే సర్టిఫికెట్ వెరిఫికేషన్

జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు డీఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 2023 జూన్ 16న పరీక్ష రాసిన మహిళా అభ్యర్థుల 1:3 నిష్పత్తి మెరిట్ జాబితాను https://deoadbd.weebly.com వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. జాబితాలో ఉన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో గురువారం డీఈఓ కార్యాలయంలో మధ్యాహ్న 3 గంటలకు హాజరుకావాలని సూచించారు.