News April 20, 2024

NZB: ఉపాధిహామీ పనికి వెళ్లి.. మహిళ ఆత్మహత్య

image

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్‌పహాడ్‌‌లో విషాదం చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన పోలేపల్లి ఇంద్రజ (40) ఉపాధిహామీ పనికి వెళ్లి అక్కడే చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త పోలేపల్లి అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులు, ఆడపిల్లల వివాహం ఎలా చేస్తామో అని బాధపడేదని ఫిర్యాదులో భర్త పేర్కొన్నాడు.

Similar News

News March 27, 2026

NZB: ట్రావెల్స్ బస్సుల్లో వెళ్తున్నారా..?

image

మార్కాపురం ఘోర ప్రమాదం నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. నిజామాబాద్, కామారెడ్డిల నుంచి హైదరాబాద్, ముంబై, బెంగళూరుకు నిత్యం ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో అధిక శాతం ఫిట్‌నెస్‌ లేకపోవడం, అతివేగం, నిబంధనలకు విరుద్ధంగా సరుకు రవాణా చేయడం ప్రమాదాలకు దారితీస్తోంది. గతంలో ఇందల్వాయి, భిక్నూర్ వద్ద జరిగిన ప్రమాదాలు నిర్లక్ష్యాన్ని చాటిచెప్పాయి.

News March 26, 2026

NZB: అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరాదు: దినేష్ రెడ్డి

image

ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో పెట్రోల్, డీజిల్ పై జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరాదని రాష్ట్ర పెట్రోల్ పంప్ డీలర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్ల దినేష్ రెడ్డి కోరారు. గురువారం ఆయన ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ.. ఇది పెట్రోల్ పంప్ యజమానులు చేస్తున్న పనిగా కొందరు మాట్లాడడం బాధాకరంగా ఉందన్నారు. ప్రజలు అవసరానికి మించి పెట్రోల్ పోయించుకుంటున్నందున అత్యవసర సేవలకు ఆటకం కలుగుతున్నదన్నారు.

News March 26, 2026

NZB: ఆయిల్ పామ్ లక్ష్య సాధనకు కృషి చేయాలి: కలెక్టర్

image

నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా NZB జిల్లాలో ఆయిల్ పామ్ సాగు జరిగేలా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం వ్యవసాయ, ఉద్యానవన, సహకార శాఖల అధికారులు, నర్సరీ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో రైతులను ప్రోత్సహిస్తూ జిల్లాలో ఈ ఏడాది 7 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు జరిగేలా అంకిత భావంతో పని చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.