News April 20, 2024

నటుడు రఘుబాబు అరెస్ట్.. బెయిల్

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన కేసులో నటుడు రఘుబాబు అరెస్ట్ అయ్యారు. అయితే వెంటనే ఆయనకు బెయిల్ మంజూరైంది. ఈ నెల 17న నల్గొండ సమీపంలో నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై రఘుబాబు కారు ఢీకొనడంతో బీఆర్ఎస్ నేత జనార్దన్‌రావు మృతి చెందారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నల్గొండ పోలీసులు రఘుబాబును అరెస్ట్ చేశారు. మొబైల్ కోర్టులో హాజరుపర్చగా ఆయనకు షరతులతో కూడిన బెయిల్ లభించింది.

Similar News

News March 15, 2026

ఈనెల 15 నుంచి పశువులకు గాలికుంటు టీకాలు: కలెక్టర్

image

పెదమిరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా ప్రచార గోడపత్రికను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు నెల రోజుల పాటు జిల్లావ్యాప్తంగా ఉచితంగా టీకాలు వేయనున్నట్లు ఆమె తెలిపారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, జిల్లా సిబ్బంది పాల్గొన్నారు.

News March 15, 2026

నన్ను డ్రగ్స్ కేసులోకి లాగితే లీగల్ యాక్షన్ తప్పదు: KTR

image

TG: ప్రతీ డ్రగ్స్ కేసులోకి తనని లాగితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని KTR హెచ్చరించారు. ఎలాంటి టెస్ట్‌కైనా తాను సిద్ధమని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చిన ప్రతీసారి BRS పార్టీని లాగడం దారుణమన్నారు. తాను, తమ పార్టీ డ్రగ్స్ వాడకానికి పూర్తి వ్యతిరేకమన్నారు. BRS Ex MLA పైలట్ <<19386182>>రోహిత్ రెడ్డి<<>> డ్రగ్స్ కేసులో చిక్కుకున్న నేపథ్యంలో KTR వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

News March 15, 2026

LPG కంటే PNG బెటర్ అంటున్న నిపుణులు!

image

దేశ ప్రజలు ఎల్పీజీ కాకుండా PNG (పైప్డ్ నేచురల్ గ్యాస్)వైపు మళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. మన దేశానికి దిగుమతి అయ్యే LPGలో 90% హార్ముజ్ నుంచే వస్తోంది. ఇప్పుడది క్లోజ్ కావడంతో ఇబ్బందులు వస్తున్నాయి. అయితే LPGతో పోలిస్తే PNGకి డిమాండ్ తక్కువగా ఉంది. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా లాంటి పలు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం కాబట్టి కొరత వచ్చే రిస్క్ తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.