News April 20, 2024

ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం: EC

image

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 19 నుంచి ఈ నిషేధం అమలులోకి వచ్చింది. 2024 జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30గంటల వరకూ ఈ నిషేధం అమలులో ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడించుకోవచ్చని ఈసీ తెలిపింది.
<<-se>>#Elections2024<<>>

Similar News

News March 16, 2026

భార్య చేసే ఈ పనులతో భర్తకు ఆరోగ్యం, ఐశ్వర్యం

image

భార్యే ఇంటికి మహాలక్ష్మి. ఆమె చేసే పనులే భర్త ఆయురారోగ్యాలకు, ఐశ్వర్యానికి కారణమవుతాయి. ఆమె తులసి కోట వద్ద దీపం వెలిగించడం వల్ల కుటుంబంలో సానుకూల శక్తి పెరుగుతుందట. ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో ఉపవాసాలు ఉంటే వైవాహిక బంధం బలపడుతుందట. సాయంత్రం వేళ ఇంటి ముంగిట, పూజ గదిలో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఇల్లాలి క్రమశిక్షణ, భక్తి ఆ ఇంట్లో ధన ధాన్యాలకు కొదువ లేకుండా చేస్తాయి.

News March 16, 2026

ప్రీ టర్మ్ బర్త్‌ను నివారించాలంటే?

image

డెలివరీ డేట్ కంటే చాలాముందుగా డెలివరీ కావడాన్ని ప్రీ టర్మ్ డెలివరీ అంటారు. దీనివల్ల పిల్లలకు అనేక సమస్యలు వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే ప్రతి నెలా రెగ్యులర్ చెకప్స్, పౌష్టికాహారం తీసుకోవాలి. మూత్రనాళ, దంత ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. ప్రెగ్నెన్సీలో పొగ, మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. పొత్తికడుపులో నొప్పి, రక్తస్రావం, ఉమ్మనీరు లీక్ ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

News March 16, 2026

నేటి నుంచి పశువులకు ఫ్రీగా ‘గాలికుంటు’ టీకాలు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఏప్రిల్ 29 వరకు పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను ప్రభుత్వం వేయనుంది. ఇందుకోసం 83.70 లక్షల టీకాలను పంపిణీ చేసింది. వెటర్నరీ డాక్టర్లు పాడి రైతుల ఇళ్ల వద్దకే వెళ్లి ఆవులు, గేదెలు, దూడలు, మేకలు, గొర్రెలకు ఈ టీకాలను వేస్తారు. కాలి గెట్టల మధ్య, నోట్లో పుండ్లు, జ్వరం ఈ వ్యాధి లక్షణాలు. సకాలంలో టీకాలు వేయకపోతే పశువులు మరణిస్తాయి.