News December 11, 2025

మంచిర్యాల జిల్లాలో తొలి విజయం మహిళదే..!

image

హాజీపూర్ మండలం నాగారం సర్పంచ్ స్థానంపై ఉత్కంఠకు తెరపడింది. ఈరోజు జరిగిన ఎన్నికల్లో నాగారం ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఫలితాలు వెలువడగా 22 ఓట్లతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మహేశ్వరి గెలుపొందారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలవగా ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.

Similar News

News March 30, 2026

BREAKING: వైభవ్ విధ్వంసం

image

చెన్నైతో మ్యాచ్‌లో RR యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించారు. 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో 5 సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. మొత్తంగా 17 బంతుల్లో 52 రన్స్ చేసి ఔటయ్యారు. మొదట బ్యాటింగ్ చేసిన CSK 19.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.

News March 30, 2026

బాపట్లలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన బాపట్లలో సోమవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. బాపట్ల రైల్వే స్టేషన్ సమీపంలోని జమ్ములపాలెం ఫ్లైఓవర్ కింద రైల్వే పట్టాలపై రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి మృతుడి ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 30, 2026

ఏప్రిల్ 1న ఉమ్మడి జిల్లా స్థాయి రగ్బీ జట్ల ఎంపిక

image

పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ క్రీడా మైదానంలో ఏప్రిల్ 1న ఉమ్మడి తూ.గో. జిల్లా స్థాయి పురుషుల, మహిళల రగ్బీ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ నిర్వహక కార్యదర్శి లక్ష్మణరావు తెలిపారు. సోమవారం ఆయన వివరాలు వెల్లడిస్తూ.. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఆధార్ కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ ప్రతులతో హాజరుకావాలని సూచించారు.