News December 11, 2025

నిర్మల్ జిల్లాలో తొలి విజయం మహిళదే

image

నిర్మల్ జిల్లా మామడ మండలం ఆదర్శ నగర్ సర్పంచ్‌గా బర్కుంట లక్ష్మి ప్రత్యర్థి నల్ల రుక్మపై 9 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలవగా ఆదర్శ నగర్ ఫలితాలు విడుదలయ్యాయి.

Similar News

News January 7, 2026

రాజానగరం: తొలిసారిగా ‘నన్నయ వర్సిటీ’కి ఫైవ్ స్టార్ గౌరవం

image

ఉన్నత విద్యారంగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మకమైన ‘ఫైవ్ స్టార్ క్వాలిటీ రేటింగ్’ సర్టిఫికెట్ లభించింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో తొలిసారిగా నన్నయ వర్సిటీ ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోవడం విశేషం. మంగళవారం అమరావతిలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ ఈ సర్టిఫికెట్‌ను వర్సిటీ వీసీ ప్రసన్నశ్రీకి అందజేసి అభినందించారు.

News January 7, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 7, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.22 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.21 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.57 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.14 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 7, 2026

ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో 315 ప్రత్యేక బస్సులు: ఆర్.ఎం

image

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో వివిధ ప్రాంతాలకు 315 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు (ఆర్‌ఎం) భవాని ప్రసాద్ తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులు ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఈ బస్సులను కేటాయించామని, ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.